మరోవైపు ఈ పుస్తకం ముద్రణ కాపీ, పీడీఎఫ్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు సోషల్ మీడియాలో, వార్తల్లో ప్రచారం జరుగుతున్నది. అదే శీర్షికతో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముద్రించినట్లుగా ఉన్న పుస్తకం పీడీఎఫ్ కాపీ కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నది. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా పూర్తి ముద్రణ పుస్తకం కొనుగోలుకు అందుబాటులో ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముద్రణకు ఇంకా అనుమతి లభించని ఈ పుస్తకం ప్రచురణ, అందులోని అంశాల లీక్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు. మరోవంక, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (పిఆర్ హెచ్ఐ) మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే జ్ఞాపకాల పుస్తకం, ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఏకైక ప్రచురణకర్త తామే అని పేర్కొంది. ఈ పుస్తకం ఇంకా విడుదలకాలేదని ధృవీకరించింది.
ఒక అధికారిక ప్రకటనలో, ఈ జ్ఞాపకాల ప్రత్యేక ప్రచురణ హక్కులను తామే కలిగి ఉన్నట్లు తెలిపింది.ప్రింటెడ్ లేదా డిజిటల్ అయినా, ఇప్పటివరకు పుస్తకం ఏ వెర్షన్ విడుదల కాలేదని, లేదా ప్రజలకు పంపిణీ చేయలేదని స్పష్టం చేసింది.
“భారత సైన్యానికి మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఏకైక ప్రచురణ హక్కులను మేము కలిగి ఉన్నామని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పష్టం చేయాలనుకుంటోంది. పుస్తకం ప్రచురణలోకి రాలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము” అని ఆ ప్రకటనలో తెలిపారు. “ప్రస్తుతం చెలామణిలో ఉన్న పుస్తకం ఏదైనా కాపీలు, పూర్తిగా లేదా పాక్షికంగా, ప్రింట్, డిజిటల్, పిడిఎఫ్ లేదా ఏదైనా ఇతర ఫార్మాట్, ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో, ఏదైనా ప్లాట్ఫామ్లో, పెంగ్విన్ కాపీరైట్ ఉల్లంఘనకు లోనవుతాయి. వెంటనే నిలిపివేయాలి” అని హెచ్చరించింది.

More Stories
ఎప్స్టీన్ ఫైల్స్‌తో బ్రిటన్ ప్రధానికి గండం… తొలి ముస్లిం ప్రధాని?
మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం
ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకిని అనుమతించం