ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ప్రభుత్వ రుణం స్థూల దేశీయోత్పత్తిలో 70.7 శాతానికి పెరిగింది. ఇది పార్లమెంట్ నిర్దేశించిన చట్టబద్ధమైన పరిమితిని మించిపోయింది. ఆ దేశం ఎదుర్కొంటున్న తీవ్రమవుతున్న ఆర్థిక ఒత్తిడిని వెల్లడిస్తోంది ఆ దేశ తాజా రుణ విధాన ప్రకటన 2026 తెలిపింది. కరాచీకి చెందిన బిజినెస్ రికార్డర్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2024–25లో ప్రభుత్వ రుణం చట్టబద్ధంగా అనుమతించిన జిడిపి పరిమితి అయిన 56 శాతం కంటే దాదాపు రూ. 16.8 ట్రిలియన్లు ఎక్కువగా ఉంది.
ఇది జిడిపిలో దాదాపు 15 శాతం పాయింట్ల ఉల్లంఘన. ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడంలో నిరంతర వైఫల్యానికి నిదర్శనంగా నివేదిక ఓవర్రన్ను అభివర్ణించింది. పాకిస్తాన్ ఆర్థిక చట్రం అదుపులేని ఖర్చు ద్వారా వర్గీకరించబడిందని, ఆ తర్వాత అంతరాన్ని పూడ్చడానికి పెరిగిన రుణాలు తీసుకుంటుందని, రుణ పరిమితులు దాటిన తర్వాత మాత్రమే అందుకు అనుమతులు ఇస్తున్నట్లు చెబుతున్నారు.
రుణాలను నియంత్రించడానికి ఉద్దేశించిన చట్టపరమైన రక్షణలు క్రమం తప్పకుండా ఉల్లంఘిస్తున్నారు. అయితే పార్లమెంటుకు తరచుగా రుణాలు తీసుకున్న తర్వాతనే తెలుపుతున్నారు. ప్రభుత్వం బాధ్యత వహించడంలేదు. ఫలితంగా, సమాఖ్య బడ్జెట్లో దాదాపు సగం మొత్తాన్ని రుణాల ద్వారానే సమకూర్చుకుంటున్నారు. అభివృద్ధి వ్యయానికి అందుబాటులో ఉన్న నిధులను గణనీయంగా తగ్గిస్తున్నారు.
ఈ ఒత్తిడి ప్రభుత్వ రంగ అభివృద్ధి కార్యక్రమాన్ని బలహీన పరచడంతో పాటు అధిక పన్నులకు దారితీతీస్తున్నది. ఇది గృహాలు, వ్యాపారాలపై ఒత్తిడిని పెంచుతుంది. గత మూడు సంవత్సరాలుగా దేశీయ రుణ సేవలే ఖర్చు వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా ఉందని, ఉత్పాదక పెట్టుబడులను అడ్డుకుంటున్నాయని, పెరుగుతున్న రుణ ఉచ్చుగా అభివర్ణించిన దానిని బలోపేతం చేసిందని నివేదిక పేర్కొంది.
ఈ నేపథ్యంలో, ఆర్థిక నిర్వహణపై చట్టసభ సభ్యులకు అధికారిక హామీలు విశ్వసనీయత లోపిస్తున్నట్లు వెల్లడవుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అగాధం అంచున ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ప్రభుత్వం రుణం-జిడిపి నిష్పత్తిలో క్షీణతను అంగీకరించినప్పటికీ, ఆర్థిక బాధ్యత, రుణ పరిమితి చట్టం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఆర్థిక ఏకీకరణ, ప్రాథమిక మిగులు, లోటులో క్రమంగా తగ్గింపు ద్వారా స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ప్రతిజ్ఞ చేసింది.
అయితే, ఆర్థిక విధాన ప్రకటన 2026 ఫెడరల్ ఆర్థిక లోటు కూడా దాని పార్లమెంటరీ పరిమితిని ఉల్లంఘించిందని, దానిని జిడిపిలో 2.7 శాతం మించిందని చూపిస్తుంది. కీలకమైన ఆర్థిక యాంకర్లు – అప్పు, లోటు – రెండూ ఒకేసారి దాటడంతో, నివేదిక స్వల్పకాలిక టర్నరౌండ్ ఆమోదయోగ్యతను ప్రశ్నించింది. ప్రస్తుత సంవత్సరంలో ప్రారంభ సూచికలు ఆందోళనలను పెంచాయి. ప్రభుత్వం పెరుగుతున్న రుణ ఒత్తిళ్లను నిర్వహించడానికి ఆర్థిక ఇంజనీరింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నప్పటికీ, జూలై-జనవరి కాలానికి ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ తన ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని నివేదికలు చెబుతున్నాయి.

More Stories
ఎయిమ్స్ బీబీనగర్ నక్సల్ సానుభూతిపరుల ఆహ్వానంపై దుమారం
మొదటిసారి రంజీ ట్రోఫీ గెలుపొందిన జమ్మూ కాశ్మీర్
ఇరాన్‌పై మిస్సైళ్లతో విరుచుకపడ్డ అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు