దీంతో భారత శుద్ధి కర్మాగారాలు రష్యన్ ముడి చమురు దిగుమతిని పూర్తిగా నిలువరించలేవని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఈ వాణిజ్య చర్చలలో తాను గెలిచానని, ఒప్పందం పూర్తిగా అమెరికా డిమాండ్లకు అనుగుణంగా జరిగిందని చూపించడానికి ప్రయత్నిస్తున్నారనే భావన కలుగుతుందని ఎద్దేవా చేశారు. చివరిసారిగా, 2022లో రష్యా యూరోపియన్, అమెరికన్ మార్కెట్ల నుండి భారత మార్కెట్‌కు మారినపుడు, అది రోజుకు 1మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించడంతో, ధరలు బ్యారెల్‌కు 120డాలర్లకు పెరిగాయని తెలిపారు. అమెరికా గ్యాసోలీన్, డీజిల్ ధరలకు జీవితకాల గరిష్ట ధర నిర్నయించిందని యుష్కోవ్ గుర్తుచేసుకున్నారు.
ట్రంప్ ప్రకటనపై రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడారు. ఏ దేశం నుండైనా చమురును కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. భారతదేశానికి చమురు, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను రష్యా మాత్రమే సరఫరా చేయదని తమకు, అలాగే ఇతర అంతర్జాతీయ ఇంధన నిపుణులకు తెలుసునని కూడా చెప్పారు.
ఈ ఉత్పత్తులను భారత్ ఇతర దేశాల నుండి కూడా కొనుగోలు చేస్తుందని, దీంతో ఈ ప్రకటన కొత్తగా ఏమీలేదని ఆయన తెలిపారు. పైగా, చమురు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు భారత్ నుండి ఎటువంటి ప్రకటన రష్యాకు రాలేదని పెస్కోవ్ మంగళవారం వెల్లడించారు. పెట్రోఉత్పత్తుల వాణిజ్యం భారత్, రష్యా రెండు దేశాలకు లబ్థి చేకూర్చాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జెక్రోవా పేర్కొన్నారు.
భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దోహద పడుతుందని తాము భావిస్తున్నామని తెలిపారు. భారతదేశం తమ భాగస్వాములతో ఈ రంగంలో సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె మీడియాతో తెలిపారు.

More Stories
భారత్ వాణిజ్య ఒప్పందాలతో స్థిరత్వంపై ప్రపంచ విశ్వాసం
బీఆర్ఎస్-కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేకుండా అప్పులే
అజిత్ దోవల్ బెదిరింపులతో ఒప్పందంకు దిగివచ్చిన ట్రంప్?