అమెరికా ఒప్పందంలో వ్యవసాయ, పాడి రంగాలకు పూర్తి రక్షణ

అమెరికా ఒప్పందంలో వ్యవసాయ, పాడి రంగాలకు పూర్తి రక్షణ

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల వ్యవసాయం, పాడి వంటి రంగాలకు పూర్తి రక్షణ లభిస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయెల్ బుధవారం లోక్సభకు తెలిపారు. ముఖ్యంగా ఈ ఒప్పందం వల్ల భారత వస్తువులపై అమెరికా సుంకాలు గతంలో ఉన్న 50 శాతం నుంచి ఏకంగా 18 శాతానికి తగ్గుతాయని చెప్పారు. ఇతర పోటీ దేశాలతో పోలిస్తే భారత్పై యూఎస్ విధించిన సుంకాలు తక్కువగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

భారత్, అమెరికా ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పూరకంగా చెబుతూ ‘భారత్ వికసిత్ భారత్ మార్గంలో ముందుకు సాగుతున్న తరుణంలో ఇంధనం, విమానయానం, డేటా సెంటర్లు, అణు ఇంధనం వంటి రంగాల్లో సామార్థ్యాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు. అయితే ఈ రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉంది కాబట్టి ఈ రంగాల్లో వాణిజ్య అవకాశాలపై మనం దృష్టి పెట్టాలని చెప్పారు. 

వాస్తవానికి దీని వల్ల మన కొనుగోళ్లు పెరుగుతాయని, అదే సమయంలో మన ఎగుమతులు కూడా విస్తరిస్తాయని పీయూశ్ గోయెల్ స్పష్టం చేశారు. “గత ఏడాది కాలంగా ఇరుపక్షాల మధ్య వివిధ స్థాయిల్లో లోతైన చర్చలు జరిగాయి. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొన్నాం. ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రయోజనాలను విజయవంతంగా కాపాడగలిగాం” అని చెప్పారు. 

ఈ ఒప్పందం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ), పారిశ్రామిక వేత్తలకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు కొత్త అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. అంతేకా ఇదిఈ ఒప్పందం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ), పారిశ్రామిక వేత్తలకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు కొత్త అవకాశాలు లభిస్తాయని కూడా తెలిపారు.

అంతేకాదు ఇది అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తుందని, తద్వారా అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తుందని, తద్వారా మేక్ ఇన్ ఇండియా, డిజైన్ ఇన్ ఇండియా, ఇన్నోవేటివ్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్ అనే మన లక్ష్యాలు సాకారం చేయడంలో ఈ ఒప్పందం చాలా తోల్పడుతుందని చెప్పారు.  భారతీయులకు ఇంధన భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని గోయెల్ స్పష్టం చేశారు. భారత విమానయాన, అణు రంగాలకు సంబంధించిన గూడ్స్ అవసరం భారత్ కు  ఉందని, ఈ విభాగాల్లో అమెరికా మనకు కీలక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు.