బీజాపుర్​లో మావోయిస్టు కీలక నేత ఉదమ్‌ సింగ్​ హతం

బీజాపుర్​లో మావోయిస్టు కీలక నేత ఉదమ్‌ సింగ్​ హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా అటవీప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులలో మావోయిస్టు కీలక నేత ఉదమ్‌ సింగ్ మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి మృతదేహాంతో పాటు ఏకే-47 రైఫిల్​ను స్వాధీం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి.

జిల్లాలోని దక్షిణ అటవీ ప్రాంతంలో సాయుధ మావోయిస్టుల ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు, డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), కేంద్ర భద్రతా బలగాల సంయుక్తంగా సెర్చ్​ ఆపేరషన్​ ప్రారంభించాయి. ఈ క్రమంలో బుదవారం ఉదయం 7:30 గంటల సమయంలో అప్పటికే మాటువేసి ఉన్న మావోయిస్టులు, బలగాలపై కాల్పులు జరిపారు. 

వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేత ఉదమ్ సింగ్ మృతి చెందాడు. ఘటనాస్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు, ఒక ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు బీజాపుర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ తెలిపారు. అయితే ఆపరేషన్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్​పీ తెలిపారు. 

ఇంకా మరికొంత మంది మావోయిస్టులు సమీపంలోనే దాక్కుని ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సమగ్ర కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. అప్పుడప్పుడు ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని అన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో భద్రత పెంచారు. గ్రామస్థులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. పుకార్లు నమ్మవద్దని, భద్రతా బలగాలకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఇక గత నెలలో ఝార్ఖండ్​లో సారండా అడవుల్లో జరిగిన భారీ ఎన్​కౌంటర్ లో 15 మంది మావోలు మృతి చెందారు. వారిలో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు పతిరామ్‌ మాంఝీ మరణించారు. ఛత్తీసగ్​ఢ్​లో ఈ ఏడాదిలో ఇప్పుటివరకు జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్లలో కనీసం 23 మంది మావోయిస్టులు హతమయ్యారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్​ మధ్య బస్తర్​ డివిజన్​లోని వివిధ జిల్లాల జరిగిన ఎన్​కౌంటర్లలో దాదాపు 285 మంది మావోలు మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 665 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.