డెలివరీ కోసం అయిదు విమానాలు సిద్ధం అయ్యాయని, ఒప్పందం ప్రకారం ఆ విమానాలను రూపొందించామని, అదనంగా 9 విమానాలను నిర్మించామని, అమెరికా ఇంజిన్ల కోసం ఎదురుచూస్తున్న బెంగుళూరుకు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కంపెనీ వెల్లడించింది. జీఈ సంస్థ నుంచి అనుకున్న తేదీ ప్రకారం అయిదు ఇంజిన్లు అందినట్లు హెచ్ఏఎల్ చెప్పింది.
ఎఫ్404 ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్ల తేజస్ మార్క్ 1ఏ జెట్ల డెలివరీ ఆలస్యమైనట్లు పేర్కొన్నది. భారతీయ వైమానిక దళం కోసం హెచ్ఏఎల్ సంస్థ 180 యుద్ధ విమానాలను ఉత్పత్తి చేస్తున్నది. వాస్తవానికి మార్చి 2024 నాటికి ఆ విమానాల డెలివరీ ప్రక్రియ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్ల .. విమానాల ఉత్పత్తిలో జాప్యం జరిగినట్లు కంపెనీ పేర్కొన్నది.

More Stories
ఢిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు
అమెరికాతో పీయూష్ గోయల్ ఫలప్రదమైన చర్చలు
వరుసగా రెండో రోజు అనిల్ అంబానీని ప్రశ్నిస్తున్న ఈడీ