జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టేశారు. పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని సభాపతి పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పును వెలువరించారు. సంజయ్‌కుమార్‌తో కలిపి ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేశారు.
తనపై బీఆర్ఎస్ నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ తీర్పు వెలువరించిన సందర్భంగా సంజయ్ కుమార్మాట్లాడుతూ తాను బీర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. తన జీతం నుంచి నెలకు రూ.5వేలు ఆ పార్టీకి కట్ అవుతున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు పెట్టి, విప్ జారీ చేస్తే మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.
జగిత్యాల అభివృద్ధి కోసం సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని వివరించారు. జగిత్యాలకు నిధుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని తెలిపారు.స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ ఆయన న్యాయబద్ధంగా పనిచేయట్లేదని ఆరోపించారు. బహిరంగంగా పార్టీ మారినట్లు అర్ధమవుతున్నప్పటికీ చర్య తీసుకోకపోవడం దురదృష్టకరమని చెబుతూ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనబడతలేదా? అని ప్రశ్నించారు. వారు బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరువుతున్నారని జగదీష్‌రెడ్డి ఆరోపించారు. స్పీకర్ వదిలినా కోర్టుల్లో శిక్ష తప్పదని, వాళ్లను డిస్మిస్ చేయడం ఖాయమని హెచ్చరించారు.

More Stories
మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి పవన్ కళ్యాణ్ ప్రచారం
ఈ ఏడాది చివరి నాటికి ఎయిమ్స్ బీబీనగర్ హాస్పిటల్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు కాబినెట్ నిర్ణయం చాలు