* పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.. నిర్మల
కేంద్ర బడ్జెట్ భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2047 మిషన్ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పా”. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కాగా, బడ్జెట్లో పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. టెక్నాలజీ పూర్తిస్థాయిలో సామాన్యుడికి ఉపయోగపడాలని అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీదేనని అన్నారు. దివ్యాంగులకు అండగా ఉండేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 వాటర్‌వేస్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
“బయోఫార్మా రంగం రూపురేఖలు మారబోతున్నాయి. బయోఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం కానున్నాయి. సెమీకండక్టర్ మెషిన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అరుదైన ఖనిజాలు వెలికితీతకు ప్రాధాన్యత ఇచ్చాం. ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడులోని అరుదైన ఖనిజాలు వెలికితీస్తాం. దిగుమతులకు ఉపయోగపడేలా 3 కెమికల్ పార్కులు తెస్తున్నాం. అత్యాధునిక అగ్నిమాపక పరికరాలు రాబోతున్నాయి. దేశీయ తయారీ టన్నెల్ బోరింగ్ మెషీన్లకు మద్దతిస్తున్నాం” అని నిర్మల చెప్పారు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తామని, బడ్జెట్ వికసిత్ భారత్‌కు అండగా నిలుస్తుందని తెలిపారు. ఖాదీ, చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించామని చెప్పారు. రూ.10 వేల కోట్ల ఫండ్‌తో ఎంఎస్ఎంఈలకు అండగా నిలుస్తామని, యువతకు శిక్షణ, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. సేవారంగం విస్తరణతోనే వికసిత్ భారత్ సాధ్యమని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.

More Stories
సాగుకు ‘ఏఐ’ సాయం- రైతుల కోసం ‘భారత్ విస్తార్’
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి నూతన ఆదాయ పన్ను చట్టం
రూ.53.47లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్