అందుబాటులోకి సరికొత్త ఆధార్‌ యాప్‌

అందుబాటులోకి సరికొత్త ఆధార్‌ యాప్‌

భారతీయుల జీవితంలో ఆధార్‌ కేంద్రంగా మారింది. మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్‌ పొందడం దగ్గర నుంచి పన్నులు చెల్లించడం, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం వరకూ ఆధార్‌ అవసరం పడుతుంది. ఇప్పటికే ఆధార్‌ను కోట్లాది మంది భారతీయులు ఆధార్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ ఈ కార్డు విషయంలో ప్రజలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

ఉదాహరణకు ఆధార్‌ కార్డు పోగొట్టుకోవడం, చిరునామా, మొబైల్‌ నంబర్‌ మార్చుకోవడం వంటి సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించే విధంగా రికొత్త ఆధార్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌తోపాటు ఎంపిక చేసిన డేటాను మాత్రమే పంచుకోవడానికి, ఆధార్‌ సర్వీసులను సులభంగా, సురక్షితంగా వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ముఖ్యంగా ఆధార్‌ నంబర్‌ హోల్డర్లు తమ మొబైల్‌ నంబర్‌ను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా అప్‌డేట్‌ చేసుకోవడానికి ఈ యాప్‌ వీలు కల్పిస్తుందని తెలిపింది. ఆధార్‌ జిరాక్స్‌లను ఇతరులతో పంచుకోవడం వల్ల వచ్చే సమస్యలను కొత్త యాప్‌లోని సెలెక్టివ్‌ షేర్‌ ఫీచర్‌తో పరిష్కరించుకోవచ్చునని తెలిపిం ది. అలాగే ఆధార్‌ జిరాక్స్‌ కాపీని ఇవ్వాల్సిన అవసరంలేకుండా ఎంపిక చేసిన ఆధార్‌ సమాచారాన్ని పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది.

అలాగే, పూర్తి భద్రత కోసం బయోమెట్రిక్స్‌ లాక్స్‌, ఫ్యామిలీ ప్రొఫైల్స్‌ ఆప్షన్‌ ద్వారా ఒకే ఫోన్‌లో బహుళ ఆధార ప్రొఫైల్స్‌ను నిర్వహించుకోవచ్చునని, ఆధార్‌ ముఖ ప్రామాణీకరను ఉపయోగించి మొబైల్‌ నంబర్‌ను ఆప్‌డేట్‌ చేసుకొవచ్చునని తెలిపారు. ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ ఆప్షన్‌ ద్వారా ఆధార్‌ కార్డు హోల్టర్లు తమ గుర్తింపును సురక్షితంగా, తక్షణమే ధ్రువీకరించుకోవచ్చునని ఉడాయ్ ప్రకటించింది.