బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల హిందువులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్కడి హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పని చేస్తున్న భారతీయులు చాలా మంది ఇండియాకు తిరిగొచ్చేస్తున్నారు.
ప్రైవేటు రంగంలోనే కాకుండా భారత రాయబార కార్యాలయంతోపాటు వివిధ రంగాల్లో పని చేస్తున్న కేంద్ర సంస్థల ఉద్యోగులు కూడా బంగ్లాను వీడుతున్నారు. తాజాగా 9 మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు బంగ్లాదేశ్‌ను వదిలి ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర విద్యుత్ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీకి చెందిన ఉద్యోగులు కొందరు బంగ్లాదేశ్‌లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు.
ఇండియా-బంగ్లా మధ్య ఉన్న మైత్రి ప్రకారం బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్‌షిప్ పవర్ కంపెనీ నిర్వహిస్తున్న రాంపాల్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. అయితే, అక్కడ నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో తొమ్మిది మంది భారతీయ ఉద్యోగులు ఆ దేశాన్ని వీడి, శనివారం భారత్ కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి వారు అక్కడి అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని సమాచారం. అలాగే నోటీసులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.
అక్కడి ఉద్యోగులను తనిఖీ చేయగా వారు విధులకు రాలేదని తెలియడంతో విచారించారు. వారు భారత్ కు వెళ్లిపోయారని తెలిసింది. భోమ్రా మార్గం ద్వారా వారు భారత్ కు తిరిగి వచ్చినట్లు గుర్తించారు. బంగ్లాలో ఉన్న భారత ఉద్యోగులకు ఇండియన్ ఎంబసీ ఇప్పటికే ఒక సూచన చేసింది. కుటుంబంతో కలిసి అక్కడ ఉండటం క్షేమం కాదని, కుటుంబాల్ని ఇండియాకు పంపించాలని సూచించింది. దీంతో రాయబార కార్యాలయంతోపాటు పలువురు ఉద్యోగులు తమ కుటుంభం సభ్యులను భారత్ కు పంపించారు.

More Stories
బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడి సజీవ దహనం
బంకర్లో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల కాల్పుల్లో 51 ఏళ్ల వ్యక్తి మృతి