వచ్చే ఏడాది నిర్వహించే జనగణనకు సంబంధించి ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్నారు. ప్రతి కుటుంబం నుంచి అన్ని కోణాల్లో వివరాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తం 33 వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందులో అతి చిన్న అంశాల నుంచి కీలక సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాల సేకరణపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర సెన్సస్ విభాగం సమాచారం పంపింది.
ఈసారి సెన్సస్ లో ప్రతి అంశాన్నీ సేకరించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికీ ఉన్న నంబర్ లేదా సెన్సస్ నెంబర్ తోపాటు, ఆ భవనంలో ఉన్న ఇతర పోర్షన్ల నంబర్లను కూడా సేకరించనున్నారు. భవనంలో ఏ అంతస్తులో నివసిస్తున్నారు? ఈ ఇంటి గోడలను, పైకప్పులను ఏ మెటీరియల్లో నిర్మించారు? ఇంటి ప్రస్తుత పరిస్థితి కూడా తెలుసుకోనున్నారు. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? ఆ ఇంటి యజమాని, నివాసముంటున్న కుటుంబ పెద్ద, ఆ ఇంటి పెద్ద పురుషుడా? మహిళా? అన్నది కూడా సేకరించనున్నారు.
ఆ ఇంటి పెద్ద కులం, మతం, ఆ కుటుంబం అద్దె ఇంట్లో ఉంటున్నారా? సొంత ఇల్లా? అన్నది కూడా సేకరించనున్నారు. నివాసం ఉంటున్న ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయి? ఎంతమంది వివాహితులు ఉంటున్నారు?తాగునీటికి ప్రధాన వనరు ఏమిటి? ఆ వనరు ద్వారా ఎంతవరకు నీటి లభ్యత ఉంటోంది?విద్యుత్ పరిస్థితి, మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటులో ఉందా? ఏ రకమైన మరుగుదొడ్లు వాడుతున్నారు?
స్నానపు గదుల వరిస్థితి, మురుగునీరు బయటకు వెళ్లేందుకు ఉన్న దారులపైనా ఆరా తీయనున్నారు. వంట చేసుకునేందుకు గ్యాస్ వాడు తున్నారా? లేక ఇతర పరికరాలు వినియోగిస్తున్నారా? అన్నది కూడా తెలుసుకోనున్నారు. ఇంట్లో రేడియో, ట్రాన్సిస్టర్, టెలివిజన్, ఇంటర్నెట్ సేవలు, ల్యాప్టాప్, టెలిఫోన్, మొబైల్, స్మార్ట్ ఫోన్ వంటివి వినియోగిస్తున్నారా?
వాహనాలకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు, కార్లు, జీవులు వంటివి ఉన్నాయా? అవి ఏ మోడల్వి సేకరిస్తూ వారి మొబైల్ నెంబర్ కూడా సేకరించనున్నారు. మొబైల్ నెంబర్ మాత్రం కేవలం సమాచార మార్పిడి కోసమేనని పేర్కొనడం విశేషం.

More Stories
బడ్జెట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు
స్టాలిన్- విజయ్ మధ్య తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్!
వివేకానంద స్మారక చిహ్నం ఏర్పాటులో కీలక పాత్రధారి పి. లక్ష్మణన్ శివైక్యం