ఆత్మీయ భరితంగా సప్త శక్తి సంగం

ఆత్మీయ భరితంగా సప్త శక్తి సంగం

హైదరాబాద్ గౌలిదొడ్డి ప్రాంతంలో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో సప్త శక్తి సంగం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళలు, విద్యావేత్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిధిలుగా డాక్టర్ చింతల గట్టు,  వైష్ణవి విచ్చేశారు. ఆత్మీయ అతిథులుగా అడ్మిన్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి , రిటైర్ ప్రొఫెసర్ విజయ విచ్చేశారు.  వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సత్కరించారు.

ఉమ్మడి కుటుంబాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న  సవరమ్మ ను సత్కరించారు. పిల్లలతో చక్కటి సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్  సంచాలితంగా గౌలి దొడ్డి లో నిర్వహిస్తున్న సంస్కార కేంద్రం ద్వారా దీనిని ఏర్పాటు చేశారు. మహిళల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సమాజ నిర్మాణంలో వారి పాత్ర వంటి అంశాలపై వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి,  అధ్యాపకులు కృష్ణవేణి విస్తృతంగా మాట్లాడారు. కుటుంబం నుంచి దేశాభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.

సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పంచ పరివర్తన్ ప్రజల్లోకి తీసుకొని వెళుతున్నట్లు శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి పేర్కొన్నారు. కుటుంబ ప్రబోధన్, పర్యావరణ ప్రాముఖ్యత ను స్థానికులకు అర్థమయ్యే రీతిలో రమాదేవి వివరించారు. కార్యక్రమాన్ని అధ్యాపకులు సుధారాణి , పద్మశ్రీ, నవీన్, నందిని సమన్వయం చేశారు.