ధనం, నగలు, ఇంట్లో వస్తువులు దొంగతనాలు జరిగాయని తరచూ వార్తల్లో చూస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో ఏకంగా రాత్రికి రాత్రి ఇనుప వంతెనను దొంగతనం చేశారు. ఉదయం లేచి చూసే సరికి వంతెన మాయం అవ్వడంతో స్థానికులు అవాక్కు అయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా పట్టణంలో 15 మందితో కూడిన ముఠా 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను దొంగిలించింది.
ఈ సంఘటన జనవరి 17 రాత్రి వరకు స్థానికులు ఉపయోగించిన వంతెనను అర్ధరాత్రి దొంగలు మాయం చేశారు. వంతెన కనిపించడం లేదని గ్రామస్తులు కౌన్సిలర్‌కు తెలియజేశారు. కౌన్సిలర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత నిందితులను అరెస్టు చేశారు. దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించి వంతెనను అనేక ముక్కలుగా చేసి అక్రమంగా తరలించినట్లు తేలింది. ఈ సంఘటనలో ఐదుగురిని అరెస్టు చేశారు.
కౌన్సిలర్ లక్ష్మణ్ శ్రీవాస్ కలెక్టర్ కునాల్ దుదావాండ్, ఎస్పీ సిద్ధార్థ్ తివారీకి ఫిర్యాదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన పోలీసులు, అన్ని అక్రమ వ్యాపార సంస్థలను తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హడావుడిగా కత్తిరించి రవాణా చేస్తుండగా పడిపోయిన వంతెనలోని కొన్ని ముక్కలను పోలీసులు సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు.

More Stories
జమ్మూకశ్మీర్‌లో పాక్ ఉగ్రవాది హతం
చైనా నగరాలపై ప్లాస్టిక్ మేఘాలు!
కలుషిత తాగునీటితో ఇండోర్‌లో 24 మందికి అస్వస్థత