కాపిటలిజం, కమ్యూనిజం లకు ప్రత్యామ్నాయంగా భారత ఆలోచన విధానం, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 60 ఏళ్ళ క్రితం విజయవాడ వేదికగా ప్రతిపాదించిన ఏకాత్మతా మానవతావాదంగా నేడు నిలుస్తున్నదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అంతకు ముందు విజయవాడ మున్సిపల్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఏపీ బిజెపి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు విజయవాడలో జరుగుతున్న 60 వసంతాల ఏకాత్మమానవ దర్శన పునఃస్మరణ సభలో మొదటిరోజు పాల్గొంటూ సోషలిజం, కమ్యూనిజం వంటి ఆచరణ సాధ్యం కాని పాశ్చాత్య సిద్ధాంతాలను మనపై బలవంతంగా రుద్దారని తెలిపారు . ఇప్పుడు కూడా కొన్ని దేశాలు కాపిటలిజం మరికొన్ని కమ్యూనిజం వైపు నడుస్తూ గొడవపడుతున్నారని చెప్పారు.
ప్రపంచానికి తమ సిద్ధాంతాలే అవసరమని క్యాపటిలిస్టులు, కమ్యూనిస్టులు పేర్కొంటున్న సమయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1965లో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్ జాతీయ మహాసభల్లో మనదేశానికి సమాజానికి, ప్రపంచానికి, మాసవులకు కావాల్సిన అద్భుతమైన ఏకాత్మతా, మావనవతా సిద్దా:తాన్ని ఆవిష్కరించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
కమ్యూనిజం, సోషలిజం భావజాలాలు అనేవి మన దేశ ఆలోచనలు, సాంస్కతిక, సాంప్రదాయాలకు ఏ మాత్రం సంబంధం లేని వని ఏకాత్మతా మానవతా వాదం వచ్చాక మనం తెలుసుకున్నామని చెప్పారు. ఈ రోజు ప్రపంచంలో క్యాపిలిజం అనుసరిస్తోన్న దేశాలు సమస్యల్లో కొట్టుమిట్టాడున్నాయని, కమ్యూనిజం ఆచరించే దేశాలు కూడా ఆ వాదాన్ని వదిలేశాయని తెలిపారు. అయితే, మనదేశం 12 ఏళ్లుగా ప్రధాని మోదీ ఏకాత్మతా మానవతా వాదాన్ని అనుసరిస్తూ దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారని తెలిపారు.
1948లో రాష్ట్రీయ స్వయం సహాయక్ సంఘ్‌పై నిషేధం విధించిన సమయంలో దాని సిద్ధాంతం గురించి సర్దార్ పటేల్ వేసిన ప్రశ్నకు సమాధానంగా వచ్చినదే ఏకాత్మ మా నవతా దర్శనం అని, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలనతో 1965 కల్లా ఓ రూపుదిద్దుకుందని తొలుత స్వాగతం పలుకుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు.
సంఘ్ జాతీయ అధ్యక్షులు బచ్‌రాజ్ వ్యాస్ అధ్యక్షోపన్యాసంతో ఈ సమావేశంలో తీర్మానంగా ప్రవేశపెట్టడంతో ఆమోదించడి తర్వాత 25, 26 తేదీల్లో కార్యకర్తల తోచర్చ జరిగిందని చెప్పారు. తర్వాత ఏప్రిల్‌లో 21 నుంచి నాలుగు రోజుల పాటు వివిధ అంశాలపై సదస్సులు జరిగాయని, తర్వాత డిసెంబరులో అఖిల భారత ప్రతినిధుల సభల్లో దీనిని అంగీకరించారని, జాతీయ వాద సంస్థలన్నీ కూడా ఏకాత్మ మానవదర్శనానికి సంబంధించిన అనేక విషయాలు ప్రజల ముందుకు తీసుకెళ్లాయని ఆయన వివరించారు.
1965లో ప్రవచించి 1967లో కాలికట్‌లో జనసంఘ్ జాతీయ అధ్యక్షులుగా అధ్యక్షులుగా బాథ్యతలు స్వీకరించిన దీన్ దయాళ్ జీ 43 రోజుల తర్వాత అనుమాస్పద రీతిలో 1968 ఫిబ్రవరి 11న హత్యకు గురయ్యారని చెప్పారు. రెండున్నరేళ్లలో దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఏకాత్మ మానవతా దర్శనం ప్రజలు ముందుకు చర్చకు తెచ్చారని తెలిపారు.
ప్రముఖ సాహిత్యవేత్త ముదిగొండ శివప్రసాద్,కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ యాదవ్, బిజెపి శాసనసభ పక్ష నేత పెన్మత్స విష్ణు కుమార్ రాజు, శాసనమండలి బిజెపి పక్ష నేత సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

More Stories
ఇరాన్ వైపు అమెరికా కీలక సైనిక మోహరింపులు
తమిళనాట బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఖాయం
శశి థరూర్ పార్టీ మీటింగ్ కు గైరాజర్.. మోదీ సభకు హాజరు