కేరళలోనూ గుజరాత్ తరహాలో త్వరలో అధికార మార్పు

కేరళలోనూ గుజరాత్ తరహాలో త్వరలో అధికార మార్పు
గుజరాత్‌లో కేవలం ఒక నగరంలో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం, ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వెళ్లిందని, ఇప్పుడు కేరళలోనూ అదే జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలే అందుకు నిదర్శనమని చెప్పారు. కేరళ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారని పేర్కొంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ప్రభుత్వ మార్పు తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
తిరువనంతపురం నుంచి అమృత్‌ భారత్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలును ప్రధాని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ పాల్గొన్నారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అవినీతి పాలన నుంచి కేరళను విముక్తి చేయాలనే దృఢ సంకల్పానికి లభించిన విజయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 
 
దశాబ్దాలుగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు తిరువనంతపురాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని నగరమైన తిరువనంతపురంలో కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. “వామపక్షాలు, కాంగ్రెస్ కేరళ ప్రజల అవసరాలను తీర్చడంలో నిరంతరం విఫలమయ్యాయి. అయితే, మా బీజేపీ బృందం ఇప్పటికే వికసిత్ తిరువనంతపురం కోసం పనిచేయడం ప్రారంభించింది. నగర ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే. మాపై నమ్మకం ఉంచండి, చాలా కాలంగా రావాల్సిన మార్పును తీసుకొస్తున్నాం” అని తెలిపారు. 
 
తిరువనంతపురం యావత్ దేశానికి ఒక ఆదర్శ నగరంగా మారుతుందని చెబుతూ  తిరువనంతపురాన్ని దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా మార్చడానికి తన పూర్తి మద్దతును అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. “వామపక్షాలు, కాంగ్రెస్ కేరళ ప్రజల అవసరాలను తీర్చడంలో నిరంతరం విఫలమయ్యాయి. అయితే, మా బీజేపీ బృందం ఇప్పటికే వికసిత్ తిరువనంతపురం కోసం పనిచేయడం ప్రారంభించింది” అని ప్రధాని వెల్లడించారు. 

 
“నగర ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే. మాపై నమ్మకం ఉంచండి, చాలా కాలంగా రావాల్సిన మార్పును తీసుకొస్తున్నాం. తిరువనంతపురం యావత్ దేశానికి ఒక ఆదర్శ నగరంగా మారుతుంది. తిరువనంతపురాన్ని దేశంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా మార్చడానికి నేను నా పూర్తి మద్దతును అందిస్తాను.” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేరళ అభివృద్ధికి కేంద్ర చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయని, కేరళలో రైలు కనెక్టివిటీ నేడు బలోపేతం అయిందని ప్రధాని చెప్పారు. 
 
తిరువనంతపురంను స్టార్టప్‌ హబ్‌గా మార్చేందుకు కేంద్రం తీసుకున్న చొరవ గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వికసిత్ భారత్ లక్ష్యం వైపు యావత్ దేశం సమష్టిగా పనిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్ భారత్‌లో మన నగరాలు కీలక పాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. గత 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ  పిఎం స్వానిధి క్రెడిట్‌ కార్టును ప్రారంభించి లక్ష మంది లబ్దిదారులకు పిఎం స్వానిధి రుణాలను పంపిణీ చేశారు. నాగర్‌కోయిల్‌- మంగళూరు, తిరువనంతపురం- తాంబరం, తిరువనంతపురం-చర్లపల్లిలో మధ్య ప్రయాణించే మూడు అమృత్‌ భారత్‌ రైళ్లు, త్రిసూర్‌- గురువాయూర్‌ మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలును ఈ కార్యక్రమంలో ప్రారంభించారు.