పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో ఉగ్రవాద కార్యకలాపాలకు యువకులను చేర్పించే పనిచేస్తున్న ఓ వ్యక్తికి ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన సయ్యద్ ఎం ఇద్రిస్‌కు కోల్‌కతాలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం ఈ శిక్ష విధించింది.
అతను భారత శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని వివిధ నిబంధనల కింద దోషిగా నిర్ధారించారు. కోర్టు రూ. 70 వేల జరిమానా కూడా విధించింది. ఎన్ఐఏ ఈ కేసును ఏప్రిల్ 2020లో పశ్చిమ బెంగాల్ పోలీసుల నుండి స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు సమయంలో జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన అల్తాఫ్ అహ్మద్ రాథర్‌తో పాటు ఇద్రిస్‌ను అరెస్టు చేసింది.
ఏజెన్సీ ప్రకారం, ఇద్రిస్, రాథర్ పశ్చిమ బెంగాల్‌లో స్థానిక యువకులను చేర్పించడం ద్వారా ఎల్ఈటి మాడ్యూల్‌ను ఏర్పాటు చేయడానికి తానియా పర్వీన్‌తో కలిసి కుట్ర పన్నారని దర్యాప్తులో వెల్లడైంది. 2020 మార్చిలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బదురియాలో జరిగిన సోదాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ తానియా పర్వీన్‌ను అరెస్టు చేసింది.
ఈ సోదాల సందర్భంగా, జిహాదీ పాఠ్యపుస్తకాలు సహా నేరారోపణలను కలిగించే విషయాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిహాద్ చేపట్టడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యువకులను తీవ్రవాదం వైపు ఆకట్టుకొంటున్నల్టు దర్యాప్తులో వెల్లడైంది. తర్వాత, సెప్టెంబర్ 2020, మే 2021లలో, ఎన్ఐఏ అరెస్టు చేసిన ముగ్గురు నిందితులపై, పాకిస్తాన్‌కు చెందిన పరారీలో ఉన్న మరో ఇద్దరిపై కూడా చార్జిషీట్ దాఖలు చేసింది.
పరారీలో ఉన్న ఆయేషా అలియాస్ ఆయేషా బుర్హాన్ అలియాస్ ఆయేషా సిద్ధిఖి అలియాస్ సయ్యద్ ఆయేషా, బిలాల్ అలియాస్ బిలాల్ దురానీగా గుర్తించారు. ఈ ఇద్దరు పరారీలో ఉన్న నిందితులపై వరుసగా రెడ్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులపై విచారణ కొనసాగుతోంది.

More Stories
కలుషిత తాగునీటితో ఇండోర్‌లో 24 మందికి అస్వస్థత
ఢిల్లీలో వర్షం.. కశ్మీర్లో ఆలస్యంగా మంచు
ఆర్మీ వాహనం లోయలో పడి 10 మంది సైనికులు మృతి