ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలోని సేవా భవన్‌లో మధ్యాహ్నం 30 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీఏవో), సీడబ్ల్యూసీ సమావేశ నోటీసును జారీ చేసింది. పోలవరం – నల్లమలసాగర్ ప్రాజెక్టు సహా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జిఆర్ఎంబి), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్ఎంబి) నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించనున్నారు. అవసరమైతే నిపుణులు, సీనియర్ ఇంజినీర్లను కమిటీకి సహాయకులుగా నియమించడం, ఇతరత్రా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు పూర్తి సమాచారం, నివేదికలతో హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జల వివాదాల పరిష్కారానికి 15 మంది అధికారులతో జనవరి 2వ తేదీన కేంద్రం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. చైర్మన్ నేతృత్వంలోని కమిటీలో ఇరు రాష్ర్టాల నుంచి నలుగురు చొప్పున అధికారులు, కేంద్ర సంస్థల నుంచి నలుగురిని నియమించింది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్ర జల్‌శక్తి శాఖ సూచించింది.
కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించే ఈ కమిటీలో తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యానాథ్‌దాస్‌తోపాటు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ప్రత్యే క కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, ఏపీ నుంచి ఆ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ న ర్సింహమూర్తి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈలను మెంబర్లుగా నియమించింది.
అలాగే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్ బిశ్వా స్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్‌ఎంబీ) చైర్మన్ బీపీ పాండే, నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) సీఈ దాస్, సీడబ్ల్యూసీ ప్రా జెక్టు అప్రయిజల్ ఆర్గనైజేషన్(పీఏవో) సీఈ పైథాంకర్‌ను కేంద్రం నుంచి సభ్యులుగా కమిటీలో చోటు కల్పించడంతో పాటు సాంకేతిక నిపుణులను సైతం నియమించుకొనే వెసులుబాటు కల్పించింది.
గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను ఉపయోగించుకునేందుకు ఏపీ తొలుత పోలవరంబనకచర్ల(నల్లమలసాగర్) లింక్ ప్రాజెక్టును ఏపీ చేపట్టింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా జూలై 16న ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. బనకచర్లతో పాటు, ఇతర జలవివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని నిర్ణయించారు.
గత నెల 15న ఏపీ నలుగురు అధికారులను నిపుణుల కమిటీకి సిఫార సు చేస్తూ కేంద్రానికి నివేదించింది. 23న తెలంగాణ సర్కారు సైతం ఏడుగురు అధికారుల జాబితాను నివేదించడంతో జల్‌శక్తి శాఖ కమిటీని ఏర్పాటు చేసింది.

More Stories
క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం
భారత్ లో స్వీయ అసంబద్ధతతో పతనమైన కమ్యూనిజం
అకల్ తఖ్త్ ముందు హాజరైన సీఎం మాన్