ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో ఒక సిక్కు బాలికను పాకిస్తానీ గ్యాంగ్ అపహరించింది. అంతేకాదు ఆమెపై అత్యాచారానికి పాల్పడింది. ఇది తెలిసిన సిక్కులు నిందితుల ఇంటిపై దాడి చేసి, ఆమెను రక్షించారు. మొత్తం 200 మందికిపైగా సిక్కులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన వెస్ట్ లండన్ లోని హూన్ స్లో ఏరియాలో జరిగింది.
ఒక 14 ఏళ్ల సిక్కు బాలికను పాకిస్తానీ గ్యాంగ్ ఇటీవల ఎత్తుకెళ్లింది. ఆమెతో కొంతకాలంగా స్నేహంగా నటించిన పాక్ గ్యాంగ్ సభ్యులు బాలికకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. తాము ఉండే ఇంటికి తీసుకెళ్లి దాదాపు ఐదారుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర వేధింపులకు గురి చేశారు. బాలిక పారిపోయేందుకు ప్రయత్నించినా అడ్డుకుని, రూంలో బంధించారు.
ఈ విషయం పోలీసులకు తెలిసినా సరిగ్గా స్పందించలేదు. దీంతో విషయం తెలిసిన సిక్కులు నెమ్మదిగా ఒక్కటయ్యారు. నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. దాదాపు 200 మందికిపైగా సిక్కులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. బాలికను రక్షించేందుకు ప్రయత్నించారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అందరూ కలిసి బాలికను రక్షించారు. నిందితుల వయసు 30-40 మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల లండన్ లో పాక్ సహా కొన్ని దేశాలకు చెందిన వ్యక్తులు బ్రిటన్ లోని మహిళలపై అత్యాచారానికి పాల్పడే ఘటనలు బాగా పెరిగాయి. అందులోనూ సిక్కుల్ని పాక్ గ్యాంగ్స్ టార్గెట్ చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ హెచ్చరికలు చేస్తున్నా లండన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ దేశ ప్రధాని కూడా దీనిపై స్పందించడం లేదు.

More Stories
డెన్మార్క్తోనే కొనసాగుతాం.. గ్రీన్లాండ్ ప్రధాని స్పష్టం
ఇరాన్లో భారతీయులు వెంటనే ఆ దేశాన్ని విడిచి రావాలి
ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కెనడా 40 ఏళ్లుగా విఫలం