ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులంటే రక్తపాతమే!

ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులంటే రక్తపాతమే!
త్రిలోక్
 
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలు, వాటి పరిణామాలు, సంబంధిత ప్రాణనష్టంపై సమగ్ర విశ్లేషణాత్మక వ్యాసం
 
ఎర్ర జెండాలు పట్టుకొని విప్లవాలు తీసుకొస్తామంటూ జనాన్ని రెచ్చగొట్టడంలో సిద్దహస్థులైన కమ్యూనిస్టుల చరిత్ర ప్రపంచంలో ఎక్కడ చూసినా రక్తపాతమే కనిపిస్తుంది. తామే సిద్ధాంతం కోసం త్యాగాలు చేసే యోధులం అని చెప్పుకొని కమ్యూనిస్టులు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ చూసినా హింసను రేకేతించడంతో పాటు భారీగా తమ దారికి రాని వారి ప్రాణాలను బలి తీసుకోవడంలో వారికి వారే సాటి అని  చెప్పవచ్చు.
 
‘ది బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం’ వంటి చారిత్రక ఆధారాల నుండి భారతదేశంలోని కేరళ, బెంగాల్,తెలుగు రాష్ట్రాల పరిస్థితుల వరకు వారి రక్త చరిత్ర మనకు స్పష్టంగా వెల్లడవుతుంది.
 
అంతర్జాతీయ విశ్లేషణ: ‘ది బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం‘ 1997లో ప్రచురితమైన ఈ పుస్తకం, కమ్యూనిస్టు ప్రభుత్వాల హయాంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలను గణాంకాలతో ప్రపంచం ముందు ఉంచింది. ఈ పుస్తకం అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం వల్ల సుమారు 10 కోట్ల మంది మరణించారు. ఇందులో నేరుగా జరిగిన హత్యల కంటే, తప్పుడు ఆర్థిక విధానాల వల్ల వచ్చిన కరువులు (ఉదా: చైనాలో ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్’), రాజకీయ ఏరివేతలే ఎక్కువ.
 
కమ్యూనిస్టు పాలనలో అంచనా వేసిన మరణాల వివరాలు:
 
చైనా  
మావో జెడాంగ్ హయాంలో (1949-1976)  అంచనా మరణాలు: 6.5 కోట్లు
ప్రధాన కారణాలు కరువు, సాంస్కృతిక విప్లవం, ఉరిశిక్షలు.  
 
సోవియట్ యూనియన్  
జోసెఫ్ స్టాలిన్ (1924-1953) కాలంలో అంచనా మరణాలు: 2 కోట్లు
ప్రధాన కారణాలు: గులాగ్ క్యాంపులు, ఏరివేత, ఉక్రెయిన్ కరువు.  
 
కంబోడియా  
పోల్ పాట్ (ఖైమర్ రూజ్) (1975-1979)  హయాంలో  అంచనా మరణాలు: 20 లక్షలు
ప్రధాన కారణాలు: మేధావుల హత్యలు, సామూహిక సమాధులు. 

ఉత్తర కొరియా  
కిమ్ ఇల్-సుంగ్, వారసులు (1948 నుండి)  కాలంలో అంచనా మరణాలు: 20 లక్షలు+
ప్రధాన కారణాలు: ఆకలి, లేబర్ క్యాంపులు, రాజకీయ హత్యలు.

ఇదియోపియా  
మెంగిస్తు హైలే మరియమ్ (1974-1991) కాలంలో అంచనా మరణాలు: 15 లక్షలు
ప్రధాన కారణాలు: “రెడ్ టెర్రర్” (ఎర్ర భీభత్సం), కరువు.  
 
తూర్పు ఐరోపా  
వివిధ కమ్యూనిస్టు నేతలు (1945-1989) హయాంలో అంచనా మరణాలు: 10 లక్షలు
ప్రధాన కారణాలు: సోవియట్ వ్యతిరేక ఉద్యమాల అణచివేత.  
 
వియత్నాం  
హో చి మిన్ & పార్టీ (1945-1987) హయాంలో అంచనా మరణాలు: 10 లక్షలు
అధికార కాంక్ష – గెరిల్లా హింస: కమ్యూనిస్టులు అధికారంలో లేని దేశాలలో (భారతదేశం వంటివి)  సాయుధ విప్లవం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి జరిపిన గెరిల్లా యుద్ధాలు, అంతర్గత కల్లోలాల వల్ల సుమారు 10,000 మంది మరణించినట్లు ఈ పుస్తకం పేర్కొంది.
 
భారతదేశం
పశ్చిమ బెంగాల్, కేరళ అనుభవం  భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రాజకీయ హింస వ్యవస్థీకృతంగా మారింది
 
పశ్చిమ బెంగాల్ (1977-2011): సుమారు 34 ఏళ్ల పాలనలో రాజకీయ వైరుధ్యాల వల్ల వేలాది మంది మరణించారు.
రాజకీయ హత్యలు: ప్రతి ఏటా సగటున 200-300 మంది రాజకీయ కారణాలతో మరణించేవారని ఎన్ సి ఆర్ బి గణాంకాలు చెబుతున్నాయి. సైన్‌బారి హత్యలు (1970), నందిగ్రామ్ ఘటన (2007) కమ్యూనిస్టు హింసకు పరాకాష్టగా నిలిచాయి.
మారిచ్‌ఝపి మారణకాండ (1979): బంగ్లాదేశ్ శరణార్థులను ఖాళీ చేయించే క్రమంలో జరిగిన పోలీసు చర్యలో వందలాది మంది మరణించడం ఒక చీకటి అధ్యాయం.

కేరళ (రాజకీయ ఘర్షణలు): కేరళలో ముఖ్యంగా కన్నూర్ జిల్లా రాజకీయ హింసకు కేంద్రంగా మారింది. సీపీఎం  కార్యకర్తల చేస్తున్న హత్యాకాండలో అనేకమంది జాతీయవాద కార్యకర్తలు హత్య గావించబడ్డారు  ప్రతీకార హత్యల విషవలయంలో గత మూడు దశాబ్దాలలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
 
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమం భూపోరాటాల నుండి ప్రారంభమై సాయుధ నక్సలిజంగా రూపాంతరం చెందింది. మావోయిస్టులు రాజకీయ నేతలను ‘ప్రజా శత్రువులు’గా ప్రకటించి చంపడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో భయాందోళనలు నెలకొన్నాయి. 
పోలీసు ఇన్ఫార్మర్లు’ అనే నెపంతో వందలాది మంది సామాన్య పౌరులను ‘ప్రజా కోర్టుల’ ద్వారా శిక్షించి చంపడం మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడింది. రైల్వేలు, ప్రభుత్వ భవనాల ధ్వంసం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. వందలాది మంది పోలీస్ లను ఛాంపివేశారు.
 
కమ్యూనిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో హింసకు గల ప్రధాన కారణాలను ఇలా విశ్లేషించవచ్చు
 
 * వర్గ శత్రువుల సిద్ధాంతం: తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారిని ‘వర్గ శత్రువులు’గా పరిగణించడం వల్ల హింసకు ఒక నైతిక మద్దతు లభిస్తుందని భావించడం.
* వ్యవస్థల నిర్వీర్యం: పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల పార్టీ యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగం కంటే బలంగా తయారు చేయడం వల్ల రాజకీయ హింస పెరిగింది.
* చర్చల కంటే సాయుధ పోరాటమే (తుపాకీ గొట్టమే) మార్గమని నమ్మడం వల్ల భారీ ప్రాణనష్టం సంభవించింది.
 
అంతిమంగా కమ్యూనిజం, దాని అమలులో చోటుచేసుకున్న సాయుధ పోరాట మార్గాలు, ఏకపక్ష రాజకీయ ధోరణులు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ప్రజాస్వామ్య మార్గాలను కాదని హింసను ఎంచుకోవడం వల్ల సామాజిక లక్ష్యాల కంటే ప్రాణనష్టమే ఎక్కువగా మిగిలిందని చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.