ఉక్రెయిన్‌పై అత్యాధునిక క్షిపణి ‘ఒరెష్నిక్’ను ప్రయోగించినట్లు రష్యా తెలిపింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని కీవ్, లివివ్‌లపై గురువారం రాత్రి సైన్యం ఈ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వందలాది ఇతర ఆయుధాలతో పాటు నూతన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ఒరెష్నిక్‌ను ప్రయోగించామని పేర్కొంది. తాజా దాడిలో ఉక్రెయిన్ కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. భూమి, సముద్రంపై నుండి ప్రయోగించే క్షిపణులు కూడా ఉన్నాయని పేర్కొంది.
కీవ్‌పై జరిపిన దాడుల్లో నలుగరు మరణించగా, సుమారు 22మంది గాయపడినట్లు తెలిపింది. గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని వెల్లడించింది. ఒరెష్నిక్‌ను అడ్డుకోవడం అసాధ్యమని, ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణిస్తుందని పేర్కొంది. సాంప్రదాయ వార్‌హెడ్ అమర్చినప్పటికీ, ఇది అణ్వాయుధంతో సమానమని తెలిపింది. 2024 నవంబర్‌లో ఉక్రెయిన్‌లోని ఒక సైనిక కర్మాగారంపై రష్యా మొదటిసారి ఒరెష్నిక్‌ని ప్రయోగించిన సంగతి తెలిసిందే.
ఒరెష్నిక్ క్షిపణి రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక మిస్సైళ్లలో ఒకటి. పుతిన్ అధ్యక్ష భవనంపై దాడికి సంబంధించి రష్యా వాదనను ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. రష్యా ప్రయోగించిన క్షిపణి గంటలకు 13,000కి.మీ వేగంతో ప్రయాణించిందని, దానిపై దర్యాప్తు జరుగుతోందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. యూరోపియన్ యూనియన్ మరియు నాటో సరిహద్దు సమీపంలో ఈ క్షిపణి పడిందని, యూరోపియన్ భద్రతకు ఇది తీవ్ర ముప్పు అని ఉక్రెయిన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మీడియాలో వెలువడుతున్న కథనాల ప్రకారం, లివివ్ ప్రాంతంలోని భూగర్భ సహజ వాయువు నిల్వలపై ఈ దాడి జరిగింది. రష్యా దాడిపై ఉక్రెయిన్ అధికారులు తీవ్రంగా స్పందిస్తూ ఈ క్షిపణి దాడితో పాటు రష్యా మొత్తం 36 క్షిపణులు, 242 డ్రోన్లను ప్రయోగించిందని కీవ్ ఆరోపించింది. ఈ దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, కనీసం 22 మంది గాయపడినట్లు వెల్లడించింది.
రష్యా తాజా దాడి కారణంగా ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు 5.5 లక్షల మంది చీకట్లోనే మగ్గుతున్నారు. అందులోనూ చలి తీవ్రత పెరుగుతున్న సమయంలో ఈ పరిస్తితి తలెత్తడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
నాటో సరిహద్దులకు సమీపంలో ఒరెష్నిక్ క్షిపణి పడటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఉక్రెయిన్‌కే కాకుండా ఐరోపా మొత్తానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా వ్యవస్థలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

More Stories
పాకిస్థాన్ లో హిందూ యువకుడు కోహ్లీ హత్య
ఖమేనీ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్
బంగ్లాలో హిందువులపై దాడుల పట్ల భారత్, బ్రిటన్ ఎంపీ ఆందోళన