ఇంద్రకీలాద్రిపై సమన్వయం లోపం భక్తుల ఆగ్రహానికి కారణం అవుతుంది. కొద్ది రోజుల క్రితం కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ కట్ చేయటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైంది. కాగా ఇప్పుడు ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. అమ్మ వారికి అత్యంత ప్రీతిపాత్రమైన ‘శ్రీ చక్ర అర్చన’లో పురుగులు ఉన్న పాలను వాడటం తీవ్ర దుమారం రేపింది.
ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవంక, అన్ని ప్రసాద కేంద్రం వద్ద విద్యుత్ షాక్ కొట్టటంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. విజయవాడ కనకదుర్గ గుడిలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల పైన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి నిత్య పూజల్లో భాగంగా నిర్వహించే శ్రీ చక్ర అర్చనలో అపచారం జరిగింది. పూజ కోసం సిద్ధం చేసిన పాలలో పురుగులు కనిపించడంతో భక్తులు, అర్చకులు విస్మయానికి గురయ్యారు.
ప్రతి శుక్రవారం దుర్గమ్మకు శ్రీ చక్ర అర్చన అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా అమ్మవారికి గో క్షీరంతో (ఆవు పాలు) అభిషేకం, అర్చన చేస్తారు. అర్చన ప్రారంభమయ్యే సమయంలో వాడే ప్యాకెట్ పాలలో పురుగు ఉన్నట్లు అర్చకులు గుర్తించారు. పాలు కలుషితమవడంతో వెంటనే అర్చనను నిలిపేశారు. సుమారు అరగంట పాటు పూజ ఆగిపోవడంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు అయోమయానికి గురయ్యారు. అరగంట తర్వాత తాజా ఆవు పాలను తీసుకొచ్చారు. ఆ తర్వాతే అర్చన కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.
ఈ ఘటనపై భక్తులు, ధార్మిక సంస్థలు ప్రధానంగా రెండు విషయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, శాస్త్రం ప్రకారం దేవతామూర్తుల అభిషేకానికి, పూజలకు తాజా గో క్షీరం (ఆవు పాలు) మాత్రమే వాడాలి. కానీ, ఆలయ సిబ్బంది నిల్వ ఉంచిన టెట్రా ప్యాకెట్ పాలను వాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవిత్రమైన పూజకు వాడే వస్తువుల నాణ్యతను ముందుగా తనిఖీ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తుల నుంచి విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి

More Stories
పరకామణిలో చోరీ కేసుబలహీనపర్చారు
‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి
పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులుపూర్తి