టీ20 ప్రపంచకప్ లో తమ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు షిఫ్ట్ చేయాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారమే భారత్ లోనే ప్రపంచ మ్యాచ్ లన్ని ఆడాలని, లేదంటే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల భారత్- బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతాపరమైన కారణాలు చూపిస్తూ, తమ జట్టు,భారత్ లో ఆడాల్సిన ప్రపంచ కప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసింది. ఆ అభ్యర్థననే ఐసీసీ తాజాగా తిరస్కరించినట్లు తెలిసింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్త వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ తమ గ్రూప్ దశ మ్యాచ్ లన్ని భారత్ లోనే ఆడాల్సి ఉంది.
ఇటీవల బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు నుంచి వదిలేయండతో ఇరు దేశాల మధ్య వివాదం ముదిరింది. ఎలాంటి వివరణ లేకుండా తమ దేశ ఆటగాడుముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ నుంచి తప్పించడంతో బంగ్లా ఈ నిర్ణయం తీసుకుంది. తమ క్రికెట్ జట్టును భారత్కుపంపబోమని బంగ్లా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ వివాదాల మధ్యే బంగ్లాదేశ్ ప్రపంచకప్ కు తమ జట్టును ప్రకటించింది.
ప్రస్తుతం బంగ్లాలో దేశవాళీ టోర్నీ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతోంది. ఈ లీగ్ లో భారత్‌కు చెందిన రిధిమా పాఠక్ ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే భారత్- బంగ్లాదేశ్ వివాదాల నేపథ్యంలో రిధిమాను కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై రిధిమా స్వయంగా స్పష్టత ఇస్తూ తనను తొలగించారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవానేనని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తానే స్వయంగా ప్యానెల్ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.

More Stories
పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రక్షణ ఒప్పందం!
అమెరికా దురాక్రమణ దాడిలో 100 మంది మృతి
ఉక్రెయిన్‌కు భద్రతకై అమెరికా, మిత్రదేశాల భరోసా