గత 75 ఏళ్లుగా ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అన్ని కులాల ఎస్సీలు, అన్ని తెగల ఎస్టీలు అందరూ సమానంగా అభివృద్ధి చెందలేదని సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. చింతూరు లో సామాజిక సమరసత వేదిక, ఎస్సీ, ఎస్టీ,హక్కుల సంక్షేమ వేదికల సంయుక్త ఆధ్వర్యాన జరిగిన ఎస్సి, ఎస్టీ, కులాల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ 59 ఎస్సీ కులస్థులు, 35 గిరిజన తెగలవారు కలసి మెలసి పని చేయాలని ఆయన సూచించారు.
ఎస్సీలం,ఎస్టీలం అందరం కలసి మెలసి పని చేయాలని చెబుతూ మనం అందరం హిందువులం, సోదరులం అని స్పహస్తమా చేశారు. ఈ దిశలో అందరం కలసి,మెలసి పనిచేయాలని ఆర్,ఎస్,ఎస్, సమరసతా సేవా ఫౌండేషన్ లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఒకప్పుడు ప్రపంచం అంతటా అడవి,అంతటా వనవాసులే అని, నదుల వద్ద, చెరువులు ఏర్పాటు చేసుకుని గ్రామాలు ఏర్పడ్డాయని, మరి కొంతకాలంకు నగరాలు ఏర్పడ్డాయని చెబుతూ భారత దేశంలో వనవాసులు, గ్రామవాసులు, నగరవాసుల మధ్య సత్సంబంధాలు కొనసాగాయని ఆయన వివరించారు.
ఉదాహరణకు నిషాద రాజు గుహుని రాజ్యం అయోధ్యకు ఎంతో దూరంలో లేదని, అయినా గుహుడు ఎప్పుడూ స్వతంత్ర రాజే అని శ్యామ్ ప్రసాద్ గుర్తు చేశారు. ఈ గిరిజన రాజ్య స్వతంత్రతను అయోధ్య చక్రవర్తులు గౌరవించారని, శ్రీ రాముడు తన పట్టాభిషేకానికి ఇతర రాజులలో పాటు గుహుడినీ పిలిచి సమానంగా గౌరవించాడని ఆయన తెలిపారు.
అయితే, అమెరికా, ఆస్ట్రేలియాలలో గిరిజనులను పెద్ద ఎత్తున ఊచకోతకు గురి చేశారని ఆయన చెప్పారు.
ఈ సమ్మేలనంలో ఎస్టీలు 354 మంది పాల్గొనగా వారిలో కోయ 269, గుత్తికోయ 75, కొండ రెడ్లు 20 మంది ఉన్నారు. అదే విధంగా 120 మంది ఎస్సీలు పాల్గొనగా వారిలో 85 మంది మాల, 35 మంది మాదిగ వారున్నారు. సమ్మేళనంలో మొత్తం 484 మంది నాలుగు మండలాలు (చింతూరు, వి.ఆర్ పురం, కూనవరం, ఎటపాక) నుండి పాల్గొన్నారు.
భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాల వేయడంతో సమ్మేళనం ప్రారంభం అయింది. ఆర్,ఎస్,ఎస్,100 సం,ల సందర్భంగా జరుపుతున్న కార్యక్రమ వివరాలను గోదావరి విభాగ్ సంఘ చాలక్ రామచంద్రరాజు వివరించారు. సుబ్బయ్య వేదిక లక్ష్యాలను వివరించారు. సమ్మేలనంలో పూజ్య శ్రీ వేదయోగి మహరాజు, డా,పిరాట్ల శివరామ క్రిష్ణ, కంభాల శ్రీనివాస రావు ప్రసంగించారు,

More Stories
వరంగల్ కోట భూముల్లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ కు కిషన్ లేఖ!
కొత్త `ఉపాధి’ చట్టంపై ప్రతిపక్షాల కుట్రలను పటాపంచలు చేయాలి
మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి