ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో కొన్ని వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీలకు వ్యతిరేకంగా అభ్యంతరకర నినాదాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీడియో దృశ్యాలు వైరల్ కావడంతో యూనివర్శిటీ యంత్రాంగం స్పందించింది.
ఈ ఘటనపై ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేసిన విశ్వవిద్యాలయ యాజమాన్యం సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాలు ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు కేంద్రాలుగా ఉండాలని, ద్వేషపూరిత ప్రయోగశాలలుగా మారడానికి అనుమతించబోమని విశ్వవిద్యాలయం తేల్చి చెప్పింది. ఇందులో పాల్గొన్న వారిని వెంటనే సస్పెన్షన్, బహిష్కరణ, శాశ్వత బహిష్కరణకు గురిచేయవచ్చని తెలుపుతూ విశ్వవిద్యాలయం ఎక్స్ లో వరుస పోస్టులు చేసింది.
ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, గుర్తించిన విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాని విశ్వవిద్యాలయం తెలిపింది. “గౌరవనీయ ప్రధానమంత్రి, హోంమంత్రిలపై అభ్యంతరకరమైన నినాదాలు చేసిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పరిపాలన ప్రతిజ్ఞ చేసింది. ఈ విషయంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది” అని విశ్వవిద్యాలయం తెలిపింది.

More Stories
ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన ప్రారంభం
28 నుంచే పార్లమెంట్… ఆదివారమే కేంద్ర బడ్జెట్
ఉక్రెయిన్‌కు భద్రతకై అమెరికా, మిత్రదేశాల భరోసా