అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంట్లోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓహియోలోని ఆయన ఇంటి అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించేందుకు నిందితుడు యత్నించాడని సీక్రెట్ సర్వీస్ ప్రకటనలో తెలిపింది. అర్ధరాత్రి సమయంలో సుత్తితో కిటికీ అద్దాలను పగులుగొడుతుండగా నిందితుడిని పట్టుకున్నామని వెల్లడించింది.
ఓ వాహనాన్ని సైతం అతడు ధ్వంసం చేశాడని తెలిపింది. ఈ ఘటన జరిగిన సమయంలో జేడీ వాన్స్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. ఆయన వాషింగ్టన్‌లో ఉన్నారని వెల్లడించారు. అయితే, నిందితుడి పేరును అధికారులు వెల్లడించలేదు. దుండగుడు లోపలికి ఎలా ప్రవేశించాడు అనే అంశం పోలీసుల్ని, భద్రతా సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
“అర్ధరాత్రి సమయంలో సీక్రెట్ సర్వీస్ అధికారులకు ఇంట్లో పెద్ద శబ్దం వినిపించింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వెళ్లి చూడగా, ఒక వ్యక్తి సుత్తితో కిటికీ పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నాం. ఆ వ్యక్తి వాన్స్ ఇంటి దారిలో వస్తుండగా సీక్రెట్ సర్వీస్‌కు చెందిన ఒక వాహనాన్ని కూడా ధ్వంసం చేశాడు” అని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు.
ఈ దాడి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లక్ష్యంగా చేశారా? లేదా ఆయన కుటుంబ సభ్యులపై జరిగిందా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్భందించిన క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్నట్లు ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన మీడియా సమావేశంలో వాన్స్ హాజరు కాలేదని ఒక అధికారి తెలిపారు. అయితే, ఈ ఆపరేషన్ ప్రణాళిక, అమలును వాన్స్ దగ్గరి నుంచి పాల్గొన్నారు.

More Stories
ఉక్రెయిన్‌కు భద్రతకై అమెరికా, మిత్రదేశాల భరోసా
ట్రంప్ ను వెంటాడుతున్న అభిశంసన భయం
బంగ్లాదేశ్ భారత్ లో ఆడాల్సిందే