యువత సంఘ్ శాఖలకు రావాలని లేదా తమకు నచ్చిన ప్రాజెక్టులో చేరి దేశ నిర్మాణానికి సహకరించాలని సంఘ్ కోరుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. సంఘ్ శతాబ్ది సందర్భంగా భోపాల్ లో రెండు రోజుల పర్యటనలో యువ సమ్మేళనంలో పాల్గొంటూ భారతదేశ యువత మేల్కొన్నారని, వారు తమ దేశాన్ని శక్తివంతం చేయాలనుకుంటున్నారని చెప్పారు.
మనం దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటే, ఈ మార్గంలో మంచి గుణాలను అలవర్చుకుని, అహంకారం, స్వార్థాన్ని వదులుకోవలసి ఉంటుందని డాక్టర్ భాగవత్ స్పష్టం చేశారు. మంచి అలవాట్లను పెంపొందించే ఏకైక వ్యవస్థను సంఘ్ ప్రపంచానికి ఇచ్చిందని ఆయన థెయ్ల్పారు. సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ ప్రతి రంగంలోనూ పనిచేశారని, అయితే దేశంలో ఐక్యత ఎలా స్థాపించబడుతుందనే దానిపై ఆయన ఆందోళన చెందారని ఆయన చెప్పారు.
ఈ భావనను పెంపొందించే సంస్థ పేరే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని, వ్యక్తిత్వ వికాసానికి ప్రపంచంలో మరే ఇతర వ్యవస్థ లేదని ఆయన తెలిపారు. “సంఘ్ శాఖ దేశభక్తిని నేర్పిస్తుంది. దానిని అనుభవించి, ఆ లక్ష్యాన్ని జీవించాలనుకుంటే, శాఖే ఏకైక ప్రదేశం. ఇక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు” అని ఆయన వివరించారు. మనం తరచుగా అభద్రతాభావం, ఆందోళనతో జీవిస్తామని, కానీ దానికి బదులుగా మనం భయం లేకుండా జీవించాలని ఆయన సూచించారు.
మనం మనకంటే ముందు దేశాన్ని ఉంచాలి. మన సొంత అభివృద్ధి దేశం, మన కుటుంబాల పురోగతికి దోహదపడుతుందో లేదో మనం ఆలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. దేశాన్ని నిర్మించాల్సింది యువతేనని స్పష్టం చేస్తూ ప్రతి విషయంలోనూ వారే ముందుంటారని ఆయన పేర్కొన్నారు. “మీరు దేశం గురించి మాట్లాడినప్పుడు, మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, దాని కోసం మీరు అర్హతలను సంపాదించుకోవాలి. మీరు సంఘ్‌కు వచ్చి సిద్ధం కావాలి. యువత సంఘ్‌కు వచ్చి అనుభవాన్ని పొందాలని నేను కోరుతున్నాను” అని తెలిపారు.
సంఘ్ దేశానికీ కొత్త మార్గం చూపిస్తుంది
సంఘం పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ, ప్రపంచం శక్తిని వింటుందని, సంఘం మొత్తం సమాజాన్ని వెంట తీసుకుని, ధర్మాన్ని రక్షిస్తూ దేశానికి కొత్త మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు. సమాజంలో అర్థవంతమైన మార్పును తీసుకువచ్చే యువతను మనం సృష్టిస్తున్నామని ఆయన చెప్పారు. భద్రత, వృత్తికి సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా, ఎవరూ భద్రతకు హామీ ఇవ్వలేరని ఆయన స్పష్టం చేశారు.
“చింత లేకుండా జీవితాన్ని గడపండి. మానవులు రిస్క్ తీసుకుంటారు కాబట్టే వారు ప్రత్యేకమైనవారు. ప్రపంచం విజయం వైపు చూస్తుంది, కానీ ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నించిన వెంటనే, వారు పోరాటానికి భయపడతారు. కాబట్టి, మీరు రాణించగలిగే , భయం అనిపించని వృత్తియే ఉత్తమమైనది. సౌకర్యం ఆనందాన్ని తీసుకురాదు” అని చెప్పారు. ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్రశ్నకు సమాధానంగా, మనం ఏఐని నియంత్రించాలి, దానిచే నియంత్రించబడకూడదని ఆయన హెచ్చరించారు.
మనం దానిని అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని, దేశ ప్రయోజనం కోసం ఏఐ, ఇతర సాంకేతికతలను ఉపయోగించగల యువతను మనం సృష్టించాలని తెలిపారు.
కార్యక్రమ మొదటి సెషన్‌లో, అఖిల భారత సహ-బౌద్ధిక ప్రముఖ్ దీపక్ విస్పూతే, భోపాల్ కరుణ ధామ్ అధిపతి సుదేశ్ శాండిల్యా జీ మహారాజ్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. మధ్య భారతదేశ సహ-సంఘచాలక్ డాక్టర్ రాజేష్ సేథీ కూడా వేదికపై ఉన్నారు. యువతతో జరిగిన సంభాషణలో, సర్ సంఘచాలక్ డాక్టర్ భగవత్ యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
సంఘ్ ప్రత్యర్ధులు అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయడం లేదు
మొదటి సమావేశంలో, అఖిల భారత సహ-బౌద్ధిక ప్రముఖ్ దీపక్ విస్పూతే మాట్లాడుతూ, గత 100 సంవత్సరాలలో సంఘం అపారమైన ప్రజాదరణ పొందిందని చెప్పారు. అయితే, దాని ప్రత్యర్థులు దానిని ప్రతికూలంగా ప్రచారం చేశారని, వారు సంఘాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదని విచారం వ్యక్తం చేశారు.
“సంఘం 1925లో నాగ్‌పూర్‌లో ప్రారంభమైంది. భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చినట్లే, డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ సంఘం పనిని సమాజంలోకి తీసుకువెళ్లారు. భారతదేశంలో ఇంతకు ముందు ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు. డాక్టర్ సాహెబ్ తన చదువుల కోసం నాగ్‌పూర్‌కు బదులుగా కోల్‌కతాను ఎంచుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అయితే, దేశంలోని హిందూ సమాజాన్ని మానసిక బానిసత్వం నుండి విముక్తి చేయాలని ఆయన గ్రహించారు” అని ఆయన తెలిపారు.
“సంఘం స్వామి వివేకానంద చెప్పిన మూడు సూత్రాలను అనుసరించి పనిచేస్తుంది: మొదటిది, భారతీయ సమాజం సంఘటనను నేర్చుకోవాలి. రెండవది, భారతదేశంలో మనిషిని తయారుచేసే ప్రక్రియ చాలా అవసరం. మూడవది, రాబోయే 50 సంవత్సరాల పాటు, దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మాతృభూమి ఆరాధనను గౌరవించాలి” అని సూచించారు.
ప్రజలు దీనిని నమ్మలేదని, కానీ డాక్టర్ సాహెబ్, శ్రీ గురూజీ దానిని నిరూపించారని ఆయన పేర్కొన్నారు. సంఘం తన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం లేదని, కానీ ఇంటింటికీ, మనిషి మనిషికి, హృదయ హృదయానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. దేశానికి, సంఘానికి మనం ఎలాంటి తోడ్పాటు అందించగలమో చూద్దాం అంటూ సంఘం యువతను శక్తివంతం చేస్తోందని చెప్పారు.
సంఘం యువతను శక్తివంతం చేస్తోంది
భోపాల్‌లోని కరుణ ధామ్ అధిపతి సుదేశ్ షాండిల్యా మహారాజ్ యువతతో మాట్లాడుతూ, మనం తరచుగా “సమర్థులకు దోషం అంటదు” అనే సామెత వింటామని, దీని అర్థం బలంగా ఉన్నవారిని తప్పు పట్టరని కాదని, వాస్తవానికి, ఎవరి ఉద్దేశాలు నిర్దోషంగా ఉంటాయో వారే శక్తివంతులు అని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం శక్తివంతమైనప్పుడు మాత్రమే భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఎదుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల, సంఘం బలం చాలా అవసరం అని చెప్పారు.
దాతృత్వం, మంచి నడవడిక, ప్రజా సంక్షేమం, కీర్తిని ఆశించని స్ఫూర్తి ఎక్కడైనా కనిపిస్తే, అది కేవలం సంఘంలోనే అని తెలిపారు. సూర్యుడు, గంగానది ఉదాహరణను ఉదహరిస్తూ, సూర్యుడు అందరికీ సమానంగా వెలుగును ఇస్తాడని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, ప్రజలు గంగానది నీటిలో స్నానం చేస్తారని, మురికి కాలువలు కూడా అందులో కలుస్తాయని కానీ అది అందరినీ తనలో ఇముడ్చుకునే సామర్థ్యం ఉన్నందున నిరంతరాయంగా ప్రవహిస్తుందని చెప్పారు.
అదేవిధంగా, యువత కూడా శక్తివంతులు కావాలని ఆయన కోరారు. భారతదేశంలో యువతను శక్తివంతం చేస్తున్నది కేవలం సంఘం మాత్రమే అని చెబుతూ దాని శాఖలు 100 సంవత్సరాలకు పైగా వ్యక్తులను తీర్చిదిద్దుతున్నాయని కొనియాడారు. అలాగే, దేవుడిని ఆరాధించండని, ఆయన మీకు బలాన్ని ఇస్తాడని చెప్పారు.

More Stories
అస్సాంలో హైట్రిక్ విజయం దిశగా బీజేపీ
మహారాష్ట్రలో 68 స్థానాలు ఏకగ్రీవంగా గెల్చుకున్న మహాయుతి
ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ మద్దతు వెనుక రాహుల్?