రెండేళ్లలో అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అయోధ్య రామాలయంలో ఆదివారం బాలరాముడిని దర్శించుకున్న చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ విశేషాలను చంద్రబాబుకు నిర్వాహకులు వివరించారు.
రామ జన్మభూమిలో రాముడిని దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేసే భాగ్యం కలిగిందని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి అందరికీ శాశ్వతమైన పాఠాలని చెప్పారు. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. అంతకుముందు అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు యూపీ, అయోధ్య దేవాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
మంచి పాలనను మనం రామరాజ్యంతో పోల్చుతూ ఉంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కొనియాడారు. ఏ ప్రభుత్వానికి అయినా అది బెంచ్ మార్క్నని అభిప్రాయపడ్డారు. అద్భుతమైన ఈ ఆలయం నిర్మాణంలో భాగస్వాములైన అందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇది చారిత్రక ఆలయమని గుర్తు చేశారు. భారత ఆధ్యాత్మిక హబ్‌గా భవిష్యత్లో అయోధ్య మారనుందని సీఎం చంద్రబాబు తెలియజేశారు.
“భవిష్యత్తులో మన సంప్రదాయ విలువలను పెంచుతుంది. ప్రస్తుతం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సాంకేతికత, విజ్ఞానం విషయంలో మనల్ని అధిగమించేవారు లేరు. వీటికి సంప్రదాయ విలువలను జోడిస్తే మానవ సమాజానికి ఎంతో మంచిది. ఆధ్యాత్మిక విలువలు పెంచేందుకు అయోధ్య ఆలయం కీలక పాత్ర పోషిస్తుంది.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
“మంచి పాలనను మనం రామరాజ్యంతో పోల్చుతూ ఉంటాం. అద్భుతమైన అయోధ్య ఆలయం నిర్మాణంలో భాగస్వాములైన అందరినీ అభినందిస్తున్నాను. భారత ఆధ్యాత్మిక హబ్‌గా భవిష్యత్లో అయోధ్య మారనుంది. ప్రస్తుతం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరో రెండేళ్లలో అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తుంది. సాంకేతికత, విజ్ఞానం విషయంలో మనల్ని అధిగమించేవారు లేరు. ఆధ్యాత్మిక విలువలు పెంచేందుకు అయోధ్య ఆలయం కీలక పాత్ర పోషిస్తుంది” అని ముఖ్యమంత్రి అభిలాష వ్యక్తం చేశారు.

More Stories
రైతు మృతితో అమరావతి రైతుల ఆగ్రహం
దుర్గగుడికి విద్యుత్ సరఫరా మూడు గంటలు నిలిపివేత
పరకామణి కేసులో సుప్రీం తీర్పు ప్రకారం ప్రత్యేక ఎఫ్ఐఆర్