అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను ‘డెవిన్’ అనే భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. క్రిస్మస్ పండుగ ముగిసిన వెంటనే విరుచుకుపడటంతో ప్రయాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తుపాను కారణంగా శుక్ర, శనివారాల్లో 1,800కు పైగా విమానాలు రద్దు కాగా, 10 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 1,802 విమానాలు రద్దుకాగా, 22,349 ఆలస్యంగా నడుస్తున్నాయి.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు అమెరికాలో సెలవులు ఉన్నాయి. దీనికి తోడు శీతాకాలం కావడంతో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ప్రజలు సెలవులలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే, ఈ సెలవుల వేళ వింటర్ స్టార్మ్ బీభత్సం సృష్టిస్తున్నాయి.
అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను ‘డెవిన్’ అనే భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. క్రిస్మస్ పండుగ ముగిసిన వెంటనే విరుచుకుపడటంతో ప్రయాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తుపాను ప్రభావం న్యూయార్క్ నగరంతో పాటు లాంగ్ ఐలాండ్, కనెక్టికట్, పెన్సిల్వేనియా, ఉత్తర న్యూజెర్సీ ప్రాంతాలపై అధికంగా ఉంది. జాతీయ వాతావరణ విభాగం సుమారు 2.3 కోట్ల మందికి వింటర్ స్టార్మ్ హెచ్చరికలు జారీ చేసింది.
న్యూయార్క్ నగరంలో 4 నుంచి 8 అంగుళాల మంచు కురుస్తుందని, ఇతర ప్రాంతాలలో అడుగు వరకు హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. తుఫాను ప్రభావం మొదటి ఐదు నుంచి ఏడు గంటల్లోనే అత్యధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. విమాన సర్వీసులపై ప్రభావం తీవ్రంగా ఉంది. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నడీ, లాగార్డియా, న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ ఒక్కటే తన షెడ్యూల్లో 22% అనగా సుమారు 225కు పైగా విమానాలను రద్దు చేసింది. డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ వంటి ఇతర ప్రధాన విమానయాన సంస్థలు కూడా వందలాది సర్వీసులను నిలిపివేశాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం పలు విమానయాన సంస్థలు ట్రావెల్ వేవర్లను ప్రకటించాయి. పరిస్థితిని సమీక్షించిన న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్, న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ తమ రాష్ట్రాల్లో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు.
“పండుగలు, కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో ప్రయాణాలు చేసే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి” అని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రజలను హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. విమాన సర్వీసులే కాకుండా రైలు, రోడ్డు రవాణాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆమ్ట్రాక్ సంస్థ ఈశాన్య కారిడార్‌లో పలు రైళ్లను రద్దు చేయగా, న్యూజెర్సీ ట్రాన్సిట్ బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. శనివారం మధ్యాహ్నానికి తుపాను ప్రభావం తగ్గుముఖం పడుతుందని, అయితే విమాన సర్వీసులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

More Stories
ముంబై మేయర్ కోసం పట్టుబడుతున్న షిండే
సామూహిక అత్యాచార బాధితురాలి మృతితో మణిపూర్ లో ఉద్రిక్తత
గాజా శాంతి మండలిలోకి భారత్‌ను ఆహ్వానించిన ట్రంప్