సైన్యం బలవంతంగా తాము తీసుకున్న అధికారాన్ని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తోందని, ఈ ఎన్నికలను బహిష్కరిస్తామని స్థానికులు కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఎవరూ ఆసక్తి చూపడం లేదని, భద్రతాకారణాల దృష్ట్యా ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని ప్రజలు వాపోతున్నారు. జుంటా ప్రభుత్వం ఓటర్లను మభ్యపెట్టి, అవినీతి ఆరోపిస్తూ వమిన్ ఆంగ్ హైంగ్ తిరుగుబాటును తన అధికారంలోకి తీసుకున్నారు.
అవినీతి, కరోనా నిబంధనలను ఉల్లంఘించిన నేరం కింద 27 సంవత్సరాలుగా సూకీ జైలు జీవితాన్నే అనుభవిస్తున్నారు. ఆమెను విడుదల చేయాలని, మయన్మార్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా, ఐక్యరాజ్యసమితి ఎన్ని విజ్ఞపులు చేసినా జుంటా సైన్యం ఖాతరు చేయలేదు. దీంతో పలు ధనిక దేశాలు మయన్మార్ కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా ఆపేశాయి. అయినా సైన్యం దేనికి బెదరకుండా, మొండిగా పాలిస్తున్నది.
డిసెంబర్ 28న 102 టౌన్‌షిప్‌లలో, జనవరి 11న 100 టౌన్‌షిప్‌లలో దశలవారీగా పోలింగ్ జరుగుతుంది. జనవరిలో తర్వాత మూడవ దశ పోలింగ్ కూడా నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. మయన్మార్‌లో మొత్తం 330 టౌన్‌షిప్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగవని సైనిక పాలకుల అధిపతి మిన్ ఆంగ్ హ్లైంగ్ అంగీకరించారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల తేదీలను ఇంకా ప్రకటించలేదు.
తమ వద్ద ఉన్న 50,000కు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లెక్కింపును వేగవంతం చేస్తాయని సైన్యం మద్దతుగల ఎన్నికల సంఘం తెలిపింది. జాతీయ స్థాయిలో కేవలం ఆరు పార్టీలు మాత్రమే పోటీ పడుతున్నాయి. 51 పార్టీలు ఒకే ప్రాంతం లేదా రాష్ట్రంలో పోటీ చేస్తున్నాయి. గత రెండు ఎన్నికలలో పోటీ చేసిన అనేక పార్టీలను రద్దు చేశారు. సైనిక ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులు ఎన్నికలలో పాల్గొనడానికి నిరాకరించారు. దీంతో రంగంలో సైనిక ప్రభుత్వం ఆమోదించిన పార్టీలు మాత్రమే మిగిలాయి.
వీటిలో సైన్యం ప్రాక్సీ అయిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ కూడా ఉంది. ఇది 2010లో సైనిక ప్రభుత్వం నిర్వహించిన చివరి ఎన్నికలలో విజయం సాధించింది. యూఎస్‌డీపీ మొత్తం నమోదైన అభ్యర్థులలో ఐదవ వంతు అంటే 1,018 మంది అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.

More Stories
అరుణాచల్ పై కన్ను.. అమెరికా నివేదికపై భగ్గుమన్న చైనా!
నైజీరియాలో ఐఎస్ఐఎస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు
‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ