* సాంసద్ ఖేల్ మహోత్సవ్ పోస్టర్లు ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ లోని కాంటోన్మెంట్ పార్క్లో భారతరత్న, మాజీ ప్రధానిఅటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. గవర్నర్ విష్ణు దేవ్ వర్మ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.. కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజేందర్, ఎమ్యెల్స. కొమరయ్య తదితరులు నివాళులు అర్పించారు.
ఎల్.బి. నగర్‌లో మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి విగ్రహాన్ని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వేముల అశోక్, తూళ్ల వీరేందర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకురాలు కుమారి బంగారు శృతి కూడా పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో నిర్వహిస్తున్న ఖేల్ మహోత్సవను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్, మహబూబ్ కాలేజ్, ఎస్వీఐటి ఆడిటోరియంలో జరిగిన సాంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్ కోడ్, పోస్టర్ ఆవిష్కరించారు.
“సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 40 డివిజన్ల వారీగా కమిటీలు వేశాం. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని క్రీడాకారులు, పార్టీ నాయకులు, విద్యా సంస్థలు, స్పోర్ట్స్ అసోసియేషన్స్ అందరితో కలిసి సమన్వయం చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ ద్వారా అందరూ రిజిస్టర్ చేసుకునేలా ప్రోత్సహించాలి. ఈ కాంపిటిషన్స్ బాల బాలికలకు వేర్వేరుగా ఉంటాయి” అని తెలిపారు.
“అన్ని ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఇంటర్ క్యాంపస్ కాంపిటీషన్స్ పెట్టాలి. విన్నర్స్ టీమ్ రెడీ చేసుకోవాలి. అంబేద్కర్ కాలేజీ, కేశవ్ మెమోరియాల్ కాలేజీల్లో పోటీలు పెట్టాలి. ప్రతి డివిజన్ వారీగా క్రికెట్, కబడ్డి, ఖోఖో టీమ్ లు ఎన్ని వస్తే అన్నిటిని గుర్తించి డివిజన్ల వారీగా కాంపిటిషన్స్ పెట్టాలి. రన్నర్స్ టీమ్స్, విన్నర్స్ టీమ్ లతో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా మళ్లీ పోటీలు పెట్టాలి. ఇక్కడ వచ్చిన రన్నర్స్, విన్నర్స్ టీమ్ లతో పార్లమెంట్ నియోజకవర్గం స్థాయిలో జరగాలి” అని చెప్పారు.
“అసెంబ్లీ స్థాయిలో మీడియాతో టీమ్ తో పార్టీ నాయకుల టీమ్ తో కాంపిటిషన్ పెట్టాలి. క్రికెట్, కబడ్డి, ఖోఖో, వాలిబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలి. జనవరి10 వరకు15 రోజుల పాటు టీమ్ ల రిజిస్ట్రేషన్లు చేయాలి. ఏ డివిజన్ పోటీలు ఆ డివిజన్లోనే జరగాల్సిన అవసరం ఉంది”అని వివరించారు.

More Stories
దేశ హితం, ఉద్యోగుల హితం, శ్రామికుల హితం కోసమేబీఎంస్
నిర్మాణపర లోపాలు సరిచేసే విబి-జి రామ్ జి చట్టం 2025
విలక్షణమైన రాజకీయ వేత్త వాజపేయి