కేరళ ముసాయిదా ఓటర్ల జాబితాలో 2 కోట్ల 54 లక్షల 42 వేల 352 ఓటర్లు నమోదయ్యారు. 24 లక్షల 8 వేల 503 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 6,49,885 మంది ఓటర్లు మృతి చెందగా, 6,45,548 మంది ఓటర్ల చిరునామా గల్లంతైంది. 8,16,221 మంది రిజిస్టర్డ్ అడ్రస్ నుంచి శాశ్వతంగా షిఫ్ట్ అయ్యారు. అదనంగా 1,36,028 మంది ఓటర్లను డూప్లికేట్ ఎంట్రీల కారణంగా, 1,60,830 మంది ఓటర్లను ఇతర కేటగిరిల కింద గుర్తించి తొలగించారు.
ఎన్నికలకు ముందు కేరళ ఎన్నికల జాబితాలో 2,75,50,855 మంది ఓటర్లు ఉండగా, 8.65 శాతం ఓటర్లను ఎస్ఐఆర్ అనంతరం తొలగించారు. ముసాయిదా జాబితాకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు, సమస్యలు ఉన్నా 2026 జనవరి 22 వరకూ ఈసీ దృష్టికి తీసుకువచ్చే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరి 21న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. 27 లక్షల మందికి పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మొత్తం 2 కోట్ల 12 లక్షల 30 వేల 737 ఓటర్లలో 1 కోటి 84 లక్షల 95 వేల 920 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పించారు. జాబితా నుంచి తొలగించిన వారిలో 6,42,243 మంది ఓటర్లు మృతి చెందగా, 19,13,540 మంది బదిలీ కావడం, ఆబ్జెంట్ కావడం జరిగింది. 1,79,043 మంది పలు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో వారి పేర్లు తొలగించారు.
అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో ముసాయిదా ఎన్నికల జాబితాను కూడా మంగళవారంనాడు ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2 లక్షల 46 వేల 390 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో చోటుచేసుకున్నారు. 64,014 మంది పేర్లను ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. రివిజన్ ఎక్సర్‌సైజ్‌కు ముందు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎన్నికల జాబితాలో 3,10,404 మంది ఓటర్లు ఉన్నారు.
మధ్యప్రదేశ్ లో 42.74 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 19.19 లక్షల మంది పురుషులు, 23.64 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం 5 కోట్ల 74 లక్షల 6,143 మంది ఓటర్లకు గాను 5 కోట్ల 31 లక్షల 31 వేల 983 మంది ఓటర్లు వెరిఫికేషన్ పత్రాలు సమర్పించారని, 42 లక్షల 74 వేల 160 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించామని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి సంజీవ్ కుమార్ ఝా తెలిపారు. షిఫ్ట్ అయిన, గైర్హాజరైన ఓటర్లు 31.51 లక్షల మంది ఉండగా, 8.46 లక్షల మంది ఓటర్లు మృతి చెదారని, 2.77 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్లు పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు.

More Stories
17 ఏళ్ళ ప్రవాసం తర్వాత బంగ్లా వస్తున్న `భారత్ వ్యతిరేకి’ తారిక్!
రాహుల్ జరుపుతుంది ‘భారత్ బద్నామ్ యాత్ర’
విద్య, ఆరోగ్యం అందరికీ, ప్రతిచోటా అందుబాటులో ఉండాలి