దేశభక్తి, క్రమశిక్షణతో తీవ్రవాద భావజలాన్ని అడ్డుకోవచ్చని అందుకు యువత క్రమశిక్షణాయుత జీవనాన్ని అనుసరించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ శతాబ్ధి సంవత్సరం పురస్కరించుకొని బర్కత్ పురాలోని కాచిగూడ ప్రభుత్వ కళాశాలలో యువ స్వయంసేవకుల శిబిరం ముగింపు సందర్భంగా సార్వ జనికోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా హిందుత్వ భావాలు బలపడుతున్నాయని చెప్పారు. అందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం 100 సంవత్సరాలుగా చేస్తున్న కృషి అని తెలిపారు. పంచ పరివర్తన విధానంతో మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆరెస్సెస్ విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. అంతకుముందుకు కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణం నుండి కాచిగూడ ప్రభుత్వ కళాశాల వరకు భారీ పథ సంచలన్ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ కొనసాగుతున్న మార్గంలో స్వాగత వేదికలు ఏర్పాటు చేసి బిజెపి నేతలు సంఘ కార్యకర్తలు పుష్ప వర్షం కురిపించి ర్యాలీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ సంఘచాలక్ వేద ప్రకాష్. భాగ్ సంఘ్ చాలక్ డా. ప్రవీణ్ కుమార్, విభాగ ప్రచారక్ అచ్యుత్, రాష్ట్ర సహ కార్య వాహ ఎర్ర నరసింగరావు, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
బర్కత్ పురా చౌరస్తా పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుండి సంఘ్ సహ సంఘ్ చాలక్ కస్తూరి రంగన్ నగర సంఘచాలక్ రాఘవేంద్ర జి ఆర్ ఎస్ ఎస్ ప్రచార టోలి సభ్యులు డిఆర్ఎస్ నరేంద్ర, రాణా ర్యాలీకి స్వాగతం పలికారు.

More Stories
తెలంగాణలోనే తదుపరి ‘ఎస్ఐఆర్’
విద్వేష ప్రసంగాల బిల్లు ఆలోచన పట్ల బిజెపి ఆగ్రహం
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్