దేశంలో లక్ష మల్టీపర్పస్ సహకార సంఘాలు అవసరం

దేశంలో లక్ష మల్టీపర్పస్ సహకార సంఘాలు అవసరం
మన దేశంలో లక్ష మల్టీపర్పస్ సహకార సంఘాలు ఉండాలని నాబార్డ్, ఆర్బీఐ  డైరెక్టర్, సతీష్ మరాఠే సూచించారు. ప్రస్తుతం 72 వేల సంఘాలు ఉండగా, వాటిల్లో 42 వేల సంఘాలు లాభాలలో ఉన్నాయని చెప్పారు. ప్రతి సంఘం లాభాలు  గడించే విధంగా పనిచేయాలని ఆవమా ఉద్భోదించారు.
 
 హైదరాబాద్ లో తెలంగాణ సహకార భారతి ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్ష, సీఈఓలకు  తెలంగాణ రాష్ట్ర అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్ లో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ నాబార్డు సామాన్య ప్రజల ఆర్థిక స్వావలంబన పెంపుదలకు దోహద పడుతుందని చెప్పారు. మనదేశంలో జాతీయ బ్యాంకులు రెండు లక్షల గ్రామాల్లో మాత్రమే పనిచేస్తున్నాయని చెబుతూ  మన దేశంలో ఉన్న ఏడున్నర లక్షల గ్రామాలకు సరిపోవని స్పష్టం చేశారు. 
 
కావున సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేయాలని, అన్ని సంఘాలు మల్టీపర్పస్ సహకార సంఘాలుగా రూపుదిద్దుకోవాలని, సదహారు రకాల సేవలందీయాలని ఆయన స్పష్టం చేశారు.  ధరూర్ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ సంఘాలు నష్టపోవడానికి జిల్లా సహకార బ్యాంకులు కారణమని విమర్శించారు. నేరుగా అపెక్స్ బ్యాంకుతో అనుసంధానమైతే కొంతమేర వడ్డీ భారము తగ్గుతుందని  ఆవేదన వ్యక్తపరిచారు. శంషాబాద్ సంఘ అధ్యక్షులు ఆదాయపన్ను అధికారుల వేదింపులు ఎక్కువ అయినావని తెలిపారు.
 
సీఈఓలు ఈశ్వర్ గౌడ్ గణేష్ మరియు రాందాస్, జహంగీర్,  నారాయణ రెడ్డి  వాటాల ఉపసంహరణ విధానం సరిగాలేదని చెప్పారు. సభ్యులు అప్పులు చెల్లించిన సమయాలలో సభ్యులు సంఘాల్లో వాటాధనం తీసుకొని అప్పు కడుతారని తెలిపారు. జిల్లా బ్యాంకు ప్రతిసారీ వాటాలు పెట్టుకొంటూ ఉండడంతో సంఘాలు నష్టపోతున్నాయని తెలిపారు.
 
సహకార భారతి జాతీయ మర్కటింగ్ సేల్‌ ఇన్‌చార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు వై. రఘునాదబాబు, తెలంగాణా సహకార అర్బన్ భ్యాంక్స్ ఫెడరేషన్ వర్కింగ్ చైర్మన్ మదనగోపాలా స్వామి, సహకార భారతి తెలంగాణ అధ్యక్షులు వై ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిళ్ళ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు, 

.