ఉగ్రదాడి అనంతరం జూలైలో చేపట్టిన ఆపరేషన్ మహదేవ్లో భారత బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు పాక్ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. ఈ ఉగ్రవాదులను ఫైసల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానిగా పేర్కొంది. ఈ ముగ్గురితో పాటు సాజిద్ జాట్, ఎల్ఈటీ/టీఆర్ఎఫ్పై భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) 2023, ఆయుధాల చట్టం-1959, చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం-1967లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలను మోపింది.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే కారణంగా జూన్ 22న అరెస్టు చేసిన మరో ఇద్దరు నిందితులు పర్వెజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌ల పేర్లను కూడా ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. ఇంటరాగేషన్‌లో ఈ ఇద్దరూ దాడిలో ప్రమేయమున్న మరో ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. ఈ ముగ్గురూ ఎల్ఈటీ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసిన పాక్ ఉగ్రవాదులని అంగీకరించారు. పాక్‌కు చెందిన మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టు సాజిద్ జాట్. ఇతనిపై ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.
అతని అసలు పేరు హబీబుల్లా మాలిక్. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లావాసి. సైఫుల్లా, నోమి, నూమన్, లంగ్డా, అలీ సాజిద్, ఉస్మాన్ హబీబ్, షాని అనే పేర్లు కూడా ఇతనికి ఉన్నాయి. టీఆర్ఎఫ్ టాప్ కమాండర్‌గా జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ప్రధాన ఉగ్రదాడుల్లో ఇతని ప్రమేయం ఉంది. 2022 అక్టోబర్‌లో యూఏపీఏ కింద అధికారికంగా వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించారు.
ఇస్లామాబాద్‌లో ఎల్ఈటీ ప్రధాన కార్యాలయం నుంచి ఇతను భారత్‌లో ఉగ్రవాదాన్ని నడిపించే నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారంటూ సాజిత్ జాట్‌పై పలు ఛార్జిషీటు సైతం ఎన్ఐఏ నమోదు చేసింది. కశ్మీర్లో పాక్ ప్రేరేపిత టెర్రర్ నెట్‌వర్క్‌ను నడుపుతున్న అత్యత ప్రమాదకరమైన వ్యక్తుల్లో ఒకరిగా సాజిద్‌ను భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
భారత్‌పై వీరు యుద్ధం ప్రకటించారన, వీరిని కఠినంగా శిక్షించాలని ఎన్ఐఏ వర్గాలు చెప్పాయి. జూన్‌లో భారత సైన్యం చేతిలో హతమైన పాక్ ఉగ్రవాదులు సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హంజా అఫ్గనీల పేర్లను కూడా చార్జిషీట్లో పేర్కొంది ఎన్ఐఏ.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, “ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కోర్టు తీసుకుంటుంది. ఇలాంటి విషయాలను న్యాయవ్యవస్థకే వదిలివేయాలని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అని నిర్ణయించడం నా పని కాదు, లేదా మరెవరి పని కూడా కాదు. ఒక చట్టం ఉంది, ఒక కోర్టు ఉంది, కోర్టే నిర్ణయం తీసుకుంటుంది. దర్యాప్తు జరపడం ఎన్ఐఏ పని, ఆ దర్యాప్తు పూర్తయింది” అని పేర్కొన్నారు.

More Stories
నరేగా చట్టం రద్దు!.. పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపు
జస్టిస్ యశ్వంత్ వర్మకు ఆరు వరాల గడువు
నెహ్రు, ఇందిరా హయాంలో హిమాలయాల్లో అమెరికా అణు పరికరం!