సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారుల పాగా!

సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారుల పాగా!
తెలంగాణాలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మొత్తం 4,333 స్థానాల్లో సగం కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి ఆధిక్యాన్ని చాటారు.  మలి విడతలో 192 మండలాల పరిధిలోని 3911 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 2200కు పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. అయితే వీటిలో 415 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు
 
సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్‌ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన వారే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్​ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది.  బీజేపీ మద్దతుదారులకు నిర్మల్‌ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. అటు వణికించే చలిలోనూ ఉదయం నుంచే పల్లె ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావడంతో ఈసారి 85.86 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.  ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి.
 
 1100కు (25 శాతానికి) పైగా సీట్లను గెలుచుకోవడం ద్వారా గ్రామాల్లో తన ఉనికిని చాటుకుంది. మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి తొలి విడతతో పోలిస్తే స్వల్పంగా సీట్లు పెరిగాయి. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలూ పది శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకున్నాయి. నిర్మల్ జిల్లాలో మొదటి స్థానంలో,  ఆదిలాబాద్‌లో రెండో స్థానంలో నిలిచినా, బిజెపి మద్దతుదారులు  6 జిల్లాల్లో బిజెపి ఒక్కస్థానాన్ని సైతం దక్కించుకోలేకపోయారు. 
 
బీజేపీ గెలుచుకున్న సీట్లలో సింహభాగం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాలవే కావడం గమనార్హంకాగా, రెండో విడతలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌ రెబల్సే ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి సహా 20 జిల్లాల్లోనైతే సగానికంటే ఎక్కువ సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఏకగ్రీవమైన 415 పంచాయతీల్లో 90 శాతానికిపైగా కాంగ్రె్‌సవే కావడం విశేషం.
అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల తీరును అధికారులు పర్యవేక్షించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు.