థాయ్- కాంబోడియా ఘర్షణలో హిందూ దేవాలయంకు నష్టం

థాయ్- కాంబోడియా ఘర్షణలో హిందూ దేవాలయంకు నష్టం
ఇటీవల థాయిలాండ్-కంబోడియా సరిహద్దు ఘర్షణలో ప్రీహ్ విహార్ హిందూ దేవాలయానికి జరిగిన నష్టంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. రెండు పొరుగు దేశాల మధ్య తిరిగి ప్రారంభమైన సరిహద్దు ఘర్షణల సమయంలో 1,100 సంవత్సరాల పురాతనమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం దెబ్బతిన్నది. విదేశాంగ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో రెండు దేశాల మధ్య ఇటీవల పెరిగిన ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు.
 
“సంరక్షణ సౌకర్యాలకు ఏదైనా నష్టం జరగడం దురదృష్టకరం. ఆందోళన కలిగించే విషయం” అని తెలిపారు. “యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ప్రీహ్ విహార్ ఆలయం మానవాళి  ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం. భారతదేశం దాని సంరక్షణలో భాగస్వామిగా ఉంది” అని జైస్వాల్ పేర్కొన్నారు.
 
“ఆ స్థలాన్ని,  సంబంధిత పరిరక్షణ సౌకర్యాలను పూర్తిగా రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటారని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము. సంయమనం పాటించాలని, శత్రుత్వాలను నిలిపివేయడానికి, మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ఇరుపక్షాలకు మా విజ్ఞప్తిని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాము” అని భారత్ అభ్యర్ధించింది.
 
సంప్రదింపులు, శాంతి మార్గంలోకి తిరిగి రావాలని వారికి విజ్ఞప్తి చేసింది. కంబోడియా, థాయిలాండ్ లు దీర్ఘకాల సరిహద్దు వివాదాలపై జూలైలో ఐదు రోజుల యుద్ధం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణను పాటించాయి. అయితే, తిరిగి ఇప్పుడు ఘర్షణలకు దిగుతున్నాయి.  ఈ రెండు దేశాలు ఆలయ సముదాయం యాజమాన్యాన్ని ప్రకటించుకుంతున్నాయి. ఈ దేవాలయాలు ఖైమర్ సామ్రాజ్యం చారిత్రక సరిహద్దుల్లోకి వస్తాయని కంబోడియా వాదిస్తోంది. 
మరోవైపు, థాయిలాండ్ వలసరాజ్యాల యుగం మ్యాప్‌లను ఉదహరిస్తూ, దేవాలయాలు తమ భూభాగంలోనే ఉన్నాయని పేర్కొంది. ఖైమర్‌లో “గ్రాండ్‌ఫాదర్ చికెన్ గొప్ప ఆలయం” అని అనువదింసిన ఈ ఆలయం, రాజు ఉదయాదిత్యవర్మన్ II పాలనలో నిర్మించి, హిందూ దేవుడు శివుడికి అంకితం చేశారు. దాని గుండె వద్ద ఒక సహజ రాతి శివలింగం (శివుని చిహ్నం) ఉంది. దాని చుట్టూ క్లిష్టమైన శిల్పాలు, సంస్కృత శాసనాలు ఉన్నాయి.
 
ఈ ఆలయం 1,000 సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియా అంతటా భారతీయ మత, కళాత్మక సంప్రదాయాలు ఎలా వ్యాపించాయో అరుదైన అంతర్దృష్టులను అందిస్తుంది. ప్రసాత్ తా ముయెన్ థామ్‌ను ప్రత్యేకంగా చేసేది దాని దక్షిణ ముఖంగా ఉన్న ప్రవేశ ద్వారం, ఇది ఖైమర్ దేవాలయాలకు అసాధారణమైనది. వీటిలో ఎక్కువ భాగం తూర్పు ముఖంగా ఉన్నాయి. ఆలయం నుండి పొడవైన రాతి మెట్లు కంబోడియా భూభాగంలోకి దిగుతాయి, ఇది నియంత్రణ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుంది.
 
కాగా, పురాతన ప్రీహ్ విహార్ ఆలయం రెండు పొరుగు దేశాల మధ్య సంఘర్షణకు కేంద్రంగా ఉంది. ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ, యునెస్కో బుధవారం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఆలయ పరిసరాల్లో పోరాటాలపై తన ‘తీవ్ర ఆందోళన’ వ్యక్తం చేసింది. “సాంస్కృతిక ఆస్తి రక్షణను నిర్ధారించడానికి, పరిస్థితులు అనుకూలించిన వెంటనే అవసరమైన ఏవైనా భద్రతా చర్యలను అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించడానికి యునెస్కో సిద్ధంగా ఉంది” అని అది తెలిపింది. 
 
థాయ్-కంబోడియన్ సరిహద్దు వివాదం చాలా కాలంగా ఉన్న ప్రాదేశిక వాదనల కారణంగా ఏర్పడింది. 1907లో కంబోడియా ఫ్రెంచ్ వలసరాజ్యాల కాలంలో రూపొందించిన మ్యాప్ నుండి చాలా వివాదం తలెత్తింద. ఇది తప్పు అని థాయిలాండ్ వాదిస్తోంది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం కంబోడియాకు సార్వభౌమాధికారాన్ని మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నిర్ణయం చాలా మంది థాయ్‌లలో అసంతృప్తిని రేకెత్తిస్తూనే ఉంది.