ఓటర్ల జాబితా సవరణ కోసం ఎస్ఐఆర్ ప్రక్రియను చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సిర్ ప్రక్రియ డెడ్‌లైన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, యూపీ, అండమాన్ నికోబార్ కోసం కొత్త సిర్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన ఎన్నికల సంఘం సీఈవోలు అభ్యర్థన చేసిన నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కోసం గడువు తేదీని పొడిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఆదేశాలు ఇచ్చింది.
అయితే గోవా, లక్షద్వీప్, రాజస్థాన్, బెంగాల్‌కు మాత్రం ఎన్నికల సంఘం ఎటువంటి పొడిగింపు ఇవ్వలేదు. డిసెంబర్ 16వ తేదీన ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్ల జాబితాను పబ్లిష్ చేయనున్నారు. కొత్త డెడ్‌లైన్ ప్రకారం తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో డిసెంబర్ 14వ తేదీ, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, అండమాన్ నికోబార్‌లో డిసెంబర్ 18వ తేదీ, యూపీలో డిసెంబర్ 26వ తేదీ వరకు సిర్ ప్రక్రియ జరనున్నది.
డిసెంబర్ 19వ తేదీన తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల జాబితాను, డిసెంబర్ 23వ తేదీన మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, అండమాన్ నికోబార్, డిసెంబర్ 31వ తేదీన యూపీ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. వాస్తవానికి ఈ 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రోజు (డిసెంబర్ 11)తో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియాలి. డిసెంబర్ 16న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉంటుంది. కానీ ఇది వీలుపడలేదు. అందుకే ఎస్ఐఆర్ గడువును పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

More Stories
సోషల్ మీడియా తనిఖీలతో హెచ్-1బి వీసా ఇంటర్వ్యూలు వాయిదా
యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి
ఓ గిరిజన మహిళా హత్యతో బంగ్లా వలసదారుల గ్రామం దగ్ధం