ఈ ట్రావెల్ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ గందరగోళం కారణంగా తమ కస్టమర్లు చాలా మంది విమానాశ్రయాల్లో చాలా గంటల పాటూ చిక్కుకుపోయారని అంగీకరించింది. ఈ సందర్భంగా సంక్షోభంపై ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం, విమానాల రద్దు కారణంగా ప్రయాణికులకు పరిహారం అందిస్తామని, ఈ వోచర్లు ప్రయాణికులకు అదనంగా ఇస్తున్నామని ఇండిగో పేర్కొంది.
ఇండిగో సంక్షోభం సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడినందుకు విచారం వ్యక్తం చేసింది. “ప్రభుత్వ మార్గదర్శకాలకు అదనంగా, విమానం బయలుదేరే సమయానికి 24 గంటల్లోపు విమానాలు రద్దు అయితే, విమానం బ్లాక్ సమయాన్ని బట్టి, ప్రతి ప్రయాణికుడికి రూ.5వేలు నుంచి రూ.10వేలు వరకు పరిహారం అందిస్తాం” అని ఇండిగో ప్రకటించింది.

More Stories
వొడాఫోన్ రూ.87,695 కోట్ల బకాయిలపై మారటోరియం, వడ్డీ రద్దు
వాస్తవ జీడీపీ వృద్ధి 6.4%…. ఆర్బిఐ
తగ్గుముఖంలో బంగారం, వెండి ధరలు