భారత్‌లోని కృత్రిమమేధ వ్యవస్థకు తగిన రీతిలో మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ చైర్మెన్, సీఈవో సత్యా నాదెళ్ల వెల్లడించారు. బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సుమారు రెండు కోట్ల మంది భారతీయులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు 30 కోట్లమందికి పైగా ప్లాట్‌ఫామ్, గిగ్ వర్కర్లను సాధికారపరచడం కంపెనీ లక్ష్యం అని తెలిపారు.
“గిట్‌హబ్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల నేను ఉత్సాహంగా ఉన్నాను. 2030 నాటికి భారతదేశం అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీకి నిలయంగా మారుతుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఏఐ పోటీలో విజేతలను సాంకేతికతను ఎవరు సృష్టిస్తారనే దానిపై కాకుండా ఎవరు దానిని వేగంగా స్వీకరిస్తారనే దానిపై నిర్ణయించబడుతుందని ఆయన చెప్పారు. గిట్‌హబ్ లో 2030 నాటికి ఇండియా నెంబర్ వన్‌గా మారుతుందని ఆయన అంచనా వేశారు.
క్లోడ్ కంప్యూటింగ్ వ్యవస్థను కూడా మైక్రోసాఫ్ట్ మరింత పటిష్టం చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్సాహాన్ని ఇస్తోందని పేర్కొంటూ ఉత్తమైన మౌళిక సదుపాయాల్ని కల్పించనున్నట్లు చెప్పారు. సుమారు 17.5 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు సత్యానాదెళ్ల తెలిపారు. ఆసియా ఖండంలోనే మైక్రోసాఫ్ట్‌కు చెందిన అత్యంత భారీ పెట్టుబడి ఇదేఅని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా క్లౌడ్ ఫ్లాట్‌ఫామ్ విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చైర్మెన్ తెలిపారు.
అజూర్ కంప్యూటర్ వ్యవస్థపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 70 కన్నా ఎక్కువ సంఖ్యలో డేటా సెంటర్లు ఉన్నాయని, భారత్‌లోనూ మైక్రోసాఫ్ట్ సెంటర్లు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. భారత్‌లో జియోతోనూ భాగస్వామ్యం ఉందని పేర్కొంటూ 2026లో కొత్త డేటా సెంటర్ ప్రాంతం ఆపరేషనల్‌గా మారనున్నట్లు నాదెళ్ల చెప్పారు. దక్షిణమధ్య భారతంలో కొత్త డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోనున్నట్లు నాదెళ్ల పేర్కొన్నారు. భారతదేశం అంతటా ఏఐ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని చెబుతూ అపోలో హాస్పిటల్స్ క్లినిషియన్ కోపైలట్‌ను నియమించిందని ఆయన పేర్కొన్నారు.
ఇది వైద్యులు రోగుల ఫలితాలపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయాన్ని ఇస్తుంది. డిజిటల్ హెల్త్ లాభాపేక్షలేని ఖుషీ బేబీ కొత్త తల్లులకు మద్దతు ఇవ్వడానికి గ్రామాల్లోని ఆశా కార్మికులకు ఏఐసాధనాలను అందించింది. ఫీల్డ్ ఇంజనీర్లకు అధునాతన అప్‌స్ట్రీమ్ విశ్లేషణను తీసుకురావడానికి ఓఎన్ జిసి బహుళ-ఏజెంట్ వ్యవస్థలను ఉపయోగిస్తుండగా, టెక్ మహీంద్రా అన్ని ప్రధాన భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న దాని స్వంత బహుళ-ఏజెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మించిందని ఆయన వివరించారు.

More Stories
హిందువులు చైతన్యవంతులైతేనే ఆశించిన ఫలితం
గోవా నైట్‌క్లబ్ యజమానులు థాయిలాండ్ లో అరెస్ట్!
ఓటు చోరీపై అమిత్ షా, రాహుల్ గాంధీ వాగ్వివాదం