* హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
అలాగే ఓ మాజీ సీజేఐ హిందూ భక్తుల విశ్వాసాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అదే ఆ మాజీ సీజేఐపై న్యాయవాది విమర్శలు చేస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకొని రాజకీయ పార్టీలు ఇప్పుడు హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం, సంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.
ఆ తీర్పునకు ప్రతిగా డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు 120 మందికిపైగా న్యాయమూర్తి అభిశంసనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపులేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తిని తొలగించాలంటే ‘సాక్ష్యాలతో నిర్ధారిత దుర్వినియోగం లేదా అశక్తత’ అవసరమని పవన్ కల్యాణ్ తెలిపారు.
కేవలం ఒక తీర్పు నచ్చలేదన్న కారణంతో ఇంపీచ్‌మెంట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలపై కేసుల్లో తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సందేశాన్ని పంపే ప్రయత్నమే ఇదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పుగా మారుతున్నాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
రాజకీయ పక్షపాతం లేకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే సంస్థాగత మద్దతు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ వ్యవహారాలను భక్తులే స్వయంగా నిర్వహించుకునేలా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవసరమని ఉప ముఖ్యమంత్రి మరో సారి స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా, మతపరమైన వ్యవహారాలు శాంతియుతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని ఆయన తెలిపారు.

More Stories
వందేమాతరం పాడిన వారిని ఇందిరా గాంధీ జైలులో పెట్టారు
ఏపీలో ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ యాత్ర
ఇండిగో సంక్షోభం ముగిసిందని ప్రకటించిన సీఈఓ