* వలసదారులపై దాడుల పేరుతో అరాచకం!
వలసదారులపై దాడుల పేరుతో ఎటువంటి నేరచరిత్ర లేని దాదాపు 75,000 మందిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) అదుపులోకి తీసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి తొమ్మిది నెలల్లో ఈ అరెస్టులు జరిగినట్లు జాతీయ మీడియా విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది.
ఈ మీడియా కాలిఫోర్నియా యూనివర్శిటీలోని ‘డిపార్టేషన్ డేటా ప్రాజెక్ట్’ నుండి డేటాను పొందినట్లు తెలిపింది. ఐసిఇకి వ్యతిరేకంగా ఈ సంస్థ దావా వేసిన సంగతి తెలిసిందే. జనవరి 20, అక్టోబర్ 15 మధ్య నేర చరిత్ర లేని 75,000మందికి పైగా ఖైదీలను అదుపులోకి తీసుకుంది. వీరు ఐసిఇ అరెస్ట్ చేసిన మొత్తం 2,20,000 మంది ఖైదీల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ.
ఈ గణాంకాల్లో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సిబిపి) నిర్బంధించిన వారి డేటా లేదు. ఈ ఏడాది లాస్ ఏంజిల్స్ వంటి పెద్ద నగరాల్లో దాడులు నిర్వహించినట్లు ఈ నివేదిక సూచిస్తోంది. నేరచరిత్ర లేని ఖైదీల సంఖ్య అధికంగా ఉందని తెలిపింది. ఐసిఇ సేకరించిన డేటా చిన్న నేరాలకు పాల్పడిన వ్యక్తులకు మరియు హత్య లేదా అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి మధ్య తేడాను గుర్తించదని తెలిపింది.
డిపోర్టేషన్ డేటా ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం అక్టోబర్ మధ్య కాలం వరకు ఐసిఇ నిర్బంధించిన ఈ వ్యక్తులందరిలో సుమారు 90 శాతం మంది పురుషులు ఉండగా, వీరు మెక్సికన్, గ్వాటెమాల, హోండురాన్ దేశాలకు చెందినవారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఎంతమందిని వారి దేశాలకు పంపారన్న అంశంపై స్పష్టత లేదు. అయితే సుమారు 23,000 మంది స్వచ్ఛంద బహిష్కరణ విభాగంలో జాబితా చేయబడ్డారని నివేదిక జోడించింది.

More Stories
గ్లోబల్ సౌత్ లో భారత్, రష్యా, చైనా దేశాలే కీలకం
థాయ్లాండ్-కంబోడియా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు
కెనడాలో సంగీత నృత్య బ్యాలెట్ ద్వారా భగవద్గీత