మానవ హక్కుల రక్షకుల దినోత్సవం సందర్భంగా, మంగళవారం, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) చైర్‌పర్సన్ జస్టిస్ వి రామసుబ్రమణియన్, కమిషన్ వారి హక్కులను కాపాడుకోవడానికి, వారి గొంతులను పెంచడానికి, వారు భయం లేదా పక్షపాతం లేకుండా తమ లక్ష్యాన్ని కొనసాగించగలరని నిర్ధారించుకోవడానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
కమిషన్ మానవ హక్కుల పరిరక్షకులకు అండగా నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు. 1998లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సార్వత్రికంగా గుర్తింపు పొందిన మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను ప్రోత్సహించడానికి, రక్షించడానికి వ్యక్తులు, సమూహాలు, సమాజ అవయవాల హక్కు, బాధ్యతలపై ప్రకటనను ఆమోదించిన రోజున, దీనిని ‘మానవ హక్కుల పరిరక్షకులపై ప్రకటన’ అని పిలుస్తారు.
ముఖ్యంగా, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా మానవ హక్కుల పరిరక్షకులపై ఈ ప్రకటనను (హెచ్ ఆర్ డిలు) ఆమోదించారు. అక్టోబర్ 16, 2025న, భారతదేశంలోని ఎన్ హెచ్ ఆర్ సి తన 32వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా హెచ్ ఆర్ డిల కార్యకలాపాలకు, ముఖ్యంగా వారిలో మహిళల కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి కమిషన్ తన వైఖరిని పునరుద్ఘాటించింది.
జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ, వారి కేసులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని, హెచ్ ఆర్ డిల కోసం ఫోకల్ పాయింట్, వారి కోసం ప్రత్యేక ఇమెయిల్-ఐడి, వార్షిక నివేదికలో ఒక అధ్యాయం, వివిధ వేదికలలో, కోర్ గ్రూప్ సమావేశాలలో సమాలోచనలు, ఆలోచనల మార్పిడి వంటి విధానాలు సామాన్యుల, ముఖ్యంగా బలహీన వర్గాల మానవ హక్కుల ప్రచారం, రక్షణ కోసం పోరాడటానికి వారి గొంతును బలోపేతం చేయడంలో చాలా ముందుకు సాగాయని తెలిపారు.
“ఇది చివరి మనిషి గొంతును వినిపించేలా, ఎవరూ వెనుకబడి ఉండకుండా చూసింది” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆసియా పసిఫిక్ దేశాల 28వ సమావేశం భారతీయ నైతికతను కలుపుకొని ‘ఢిల్లీ డిక్లరేషన్’ను ఏకగ్రీవంగా విడుదల చేసింది. మానవ హక్కుల పరిరక్షకులు పోషించిన కీలక పాత్రను కమిషన్ గుర్తించింది.
కమిషన్ ఇటీవల ఒడిశాలో భువనేశ్వర్, తెలంగాణాలో హైదరాబాద్ లో ‘బహిరంగ విచారణ’, `క్యాంప్ సిట్టింగ్స్’ లను నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక హెచ్ ఆర్ డిలు, పౌర సమాజ సమూహాలు, ఫిర్యాదుదారులతో నేరుగా సంభాషించింది. హెచ్ ఆర్ డిల నిజాయితీ పనిలో రాష్ట్ర ప్రభుత్వాలు అందించవలసిన సహకారాన్ని నిర్ధారించిన చర్చల గురించి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది.
“న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ పట్ల మీ అచంచలమైన నిబద్ధతకు కమిషన్ సెల్యూట్ చేస్తుంది. మీ పని తరచుగా అపారమైన సవాళ్లతో కూడుకున్నది. అయినప్పటికీ అణగారిన వర్గాల గొంతులను వినిపించేలా మీ దృఢ సంకల్పమే నిర్ధారిస్తుంది. దుర్బల వర్గాలు రక్షించబడతాయి. మానవ హక్కుల సూత్రాలు మన సమాజంలో సజీవంగా ఉంటాయి” అని చైర్‌పర్సన్ భరోసా ఇచ్చారు.

More Stories
స్థానిక నేతలతో ‘లోకల్’ సమ్మిట్‌గా మారిన `గ్లోబల్ సమ్మిట్’
సిద్దూ భార్య కౌర్ కాంగ్రెస్ నుండి సస్పెండ్
బెంగాల్లో 6.5 లక్షల మందితో భగవద్గీత పారాయణం