గత పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్ రేట్ తగ్గి రూ.7 లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పోయామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రోత్ రేట్ లేకపోవటం వల్ల రూ. 76,195 కోట్ల ఆదాయం కోల్పోయామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోందని ఆక్షేపించారు.
రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, బ్రాండ్ తగ్గి, వడ్డీ రేటు పెరిగటం వల్ల రెవెన్యూ జీఎస్డీపీలో రాష్ట్రం చాలా నష్టపోయిందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడిందని, కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు.
అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. 2024-19 మధ్య 13.5 శాతంగా ఉన్న వృద్ధిరేటు 2019-24 మధ్య కాలంలో 10.32 శాతానికి పడిపోయిందని తెలిపారు. గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చి వెళ్లిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతోందని చెబుతూ జనవరి 1 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా సమర్థిస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చిన దానిని కూడా సమర్ధిస్తారా? అని నిలదీశారు. ఇలాంటి వాటినా సమర్థిస్తున్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారని ఆక్షేపించారు. కాగా, ఎపి బ్రాండ్ పునరుద్ధరించామని తద్వారా క్రమంగా పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అభివృద్ధి (జిఎస్‌డిపి) 11.28 శాతంగా నమోదైందని, ఇది దేశ జిడిపి (8.7 శాతం) కంటే ఎక్కువని చెప్పారు.

More Stories
తిరుపతితో పాటు 233 కేంద్రాలలో తిరుప్పావై ప్రవచనాలు
రాష్ట్రంలో మతమార్పిడిలపై విచారణ జరపాలి!
పవన్ కు ఉడిపి పీఠాధిపతి ’అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు