ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో శనివారం సాయంత్రం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ జిల్లా కార్యదర్శి, స్థానిక సర్పంచ్ అభ్యర్థిని తమ్మెర రజిని రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితురాలు తమ్మెర రజిని రెడ్డి తిరుమలాయపాలెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాతర్లపాడు గ్రామానికి చెందిన ఆమె సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు.
అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్న క్రమంలో, శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె జీ.పీ (గ్రామ పంచాయతీ) సెంటర్ వద్దకు వెళ్లారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్నబత్తుల లింగయ్య, అన్నబత్తుల మహేషన్ నామినేషన్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తున్న క్రమంలో, శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె జీ.పీ (గ్రామ పంచాయతీ) సెంటర్ వద్దకు వెళ్లారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్నబత్తుల లింగయ్య, అన్నబత్తుల మహేష్ ష్ తదితరులు ఆమెను అడ్డుకుని, నామినేషన్ ఉపసంహరించుకోవాలని చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా వారు తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఎందుకు బూతులు తిడుతున్నారని ప్రశ్నించినందుకు తనపై భౌతిక దాడికి దిగారని రజిని రెడ్డి వాపోయారు.
తన భుజంపై కొట్టడమే కాకుండా, అడ్డువచ్చిన తన తమ్ముడిపై కూడా దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు మహిళ అని కూడా చూడకుండా ఇలాంటి దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని కోరుతూ తమ్మెర రజిని రెడ్డి స్థానిక ఎస్సైకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కాగా బిజెపి మహిళా నేత రజని రెడ్డిపై దాడిని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్ప రెడ్డి తీవ్రంగా ఖండించారు.

More Stories
నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు
సంక్రాంతికి హైదరాబాద్- విజయవాడ టోల్ మినహాయింపు?
బిజెపి అధ్యక్షుడు నితిన్ వచ్చే నెల తెలంగాణ పర్యటన