ఎలన్ మస్క్‌కి చెందిన సోషల్ మీడియా ‘ఎక్స్’పై యూరోపియన్ యూనియన్ (ఇయు) నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది. సోషల్ మీడియా చట్టాన్ని ఉల్లంఘించినందున 120 మిలియన్ యూరోలు(సుమారు 12వేలకోట్లకు పైగా) జరిమానా విధించినట్లు ఇయు శుక్రవారం తెలిపింది. 27 దేశాల కూటమికి చెందిన డిజిటల్ సర్వీసెస్ చట్టం ప్రకారం రెండేళ్ల క్రితం దర్యాప్తు ప్రారంభించిన యూరోపియన కమిషన్ ఇప్పుడు తన తీర్పు వెల్లడించింది.
డిఎస్‌ఎ చట్టంను అనుసరించి ఎక్స్ మూడు వేర్వేరు ఉల్లంఘనలకు పాల్పడినందున జరిమానా విధించినట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది. డిజిటల్ సర్వీస్ యాక్ట్ (డిఎస్‌ఎ) ప్రకారం యూరోపియన్ వినియోగదారులకు భద్రత కల్పించడం, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు భారీ జరిమానా విధిస్తామనే బెదిరింపులతో సహా వినియోగదారుల ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్, వాటి ఉత్పత్తులను తొలగించేందుకు బాధ్యత వహిస్తుంది.
ఎక్స్ నీలిరంగు చెక్ మార్కులు వాటి మోసపూరిత డిజైన్ నిబంధనలను ఉల్లంఘించాయని, ఇది వినియోగదారులను మోసగిస్తోందని, తారుమారు చేస్తుందని ఇయు తెలిపింది. ఎక్స్ ప్రకటన డేటా బేస్ అవసరాలను కూడా తీర్చలేకపోయిందని, పరిశోధకుల పబ్లిక్ డేటాను యాక్సెస్ చేసేందుకు వీలు కల్పించిందని ప్రకటించింది.

More Stories
ఇండిగో సంక్షోభంపై అత్యున్నత విచారణ .. వేయి విమానాలు రద్దు
మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ
బీమా సంస్థలు వైద్య చికిత్స పద్ధతులను నిర్దేశించలేవు