రైజింగ్ తెలంగాణ సమ్మిట్ అనేది రైజింగ్ ఏమీ కాదు-పూర్తిగా పొగమంచు, నాటకమే అని పేర్కొంటూ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం, విశ్రాంత ఉద్యోగులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కూడా క్లియర్ చేయలేని పరిస్థితి. ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒక్కటీ నెరవేర్చకుండా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం ప్రజా ధనాన్ని బహిరంగంగా దుర్వినియోగం చేయడమేనని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో బిజెపి వ్యతిరేకం కాదని, కాని గ్లోబల్ ఇన్వెస్టర్లు నాయకత్వం, స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ ఉన్న రాష్ట్రాల వైపే చూస్తారని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇక్కడ భూములను అమ్మకం పెట్టి, అప్పుల్లో మునిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని నెలలకొకసారి పాలసీలు మార్చేస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ‘రైజింగ్ తెలంగాణ సమ్మిట్’ పెట్టుబడులను రప్పించే కార్యక్రమం కాదు, ఈ ప్రభుత్వంలోని అస్థిరత, ఆర్థిక గందరగోళాన్ని మాత్రమే మరోసారి బహిర్గతం చేసే ఈవెంట్ అని సుభాష్ స్పష్టం చేశారు.
“దశాబ్దం పాటు తెలంగాణ దేశంలో టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో ఒకటిగా నిలిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేండ్లలోనే ఈ రాష్ట్రాన్ని పెట్టుబడుల కోసం వేడుకునే పరిస్థితికి నెట్టేసింది” అని సుభాష్ తీవ్రంగా విమర్శించారు.

More Stories
నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు
సంక్రాంతికి హైదరాబాద్- విజయవాడ టోల్ మినహాయింపు?
బిజెపి అధ్యక్షుడు నితిన్ వచ్చే నెల తెలంగాణ పర్యటన