భారత్- రష్యా స్నేహసంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని పేర్కొంటూ ద్వైపాక్షిక భేటీలో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మోదీ, తాను చర్చించామని ష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. భారత్‌కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ ఇచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆయిల్, గ్యాస్, బొగ్గు అన్నింటినీ సరఫరా చేస్తామని వెల్లడించారు.
వికసిత్ భారత్‌కు అవసరమైన ప్రతీ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో పుతిన్ ప్రసంగిస్తూ “ఇంధన రంగంలో కూడా విజయవంతమైన భాగస్వామ్యం ఉంది. భారత ఇంధన రంగం అభివృద్ధికి ఆయిల్, గ్యాస్, బొగ్గుతో సహా అవసరమయ్యే అన్నింటిని సరఫరా చేయడానికి మేము భారత్‌తో వ్యాపార భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. వేగంగా ఎకానమీ వృద్ధి చెందుతున్న భారత్‌కు అంతరాయం లేకుండా ఇంధన సరఫరాను కొనసాగించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.
“మేము అతిపెద్ద భారత అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే ప్రాజెక్టుపై పని చేస్తున్నాం. ఇప్పటికే ఆరు రియాక్టర్లలో మూడింటిని ఇంధన నెట్‌వర్క్‌కు అనుసంధానించాం. మీతో సంతోషంగా ఒకటి పంచుకోవాలని కోరుకుంటున్నాను. ద్వైపాక్షిక చెల్లింపుల కోసం భారత్, రష్యా క్రమంగా జాతీయ కరెన్సీలను ఉపయోగించే దిశగా కదులుతున్నాయి. వాణిజ్య చెల్లింపులలో దీని వాటా ఇప్పటికే 96 శాతం ఉంది” అని పుతిన్ ప్రకటించారు.
ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని, రెండు దేశాల వాణిజ్యం 64 బిలియన్ డాలర్ల నుంచి వంద బిలియన్ డాలర్లకు పెరగాలని ఆకాంక్షించారు. ఇరుదేశాల ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెబుతూ చమురు, సహజవాయువు, బొగ్గు సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నామని, వైద్య, వ్యవసాయ రంగాల్లో కలిసి ముందుకెళ్తామని వివరించారు.
“మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. ముఖ్యంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించాం. భారత్‌తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం. ఇరుదేశాల వాణిజ్యం 64 బిలియన్ డాలర్ల నుంచి వంద బిలియన్ డాలర్లకు పెరగాలి. ఇరుదేశాల ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ఇరుదేశాల మధ్య రవాణా అనుసంధానం పెంచడం మా లక్ష్యం” అని పుతిన్ తెలిపారు.
“అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. భారత్‌లో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తాం. చమురు, సహజవాయువు, బొగ్గు సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నాం. వైద్య, వ్యవసాయ రంగాల్లో కలిసి ముందుకెళ్తాం. పరిశ్రమల స్థాపన, ఆధునిక యంత్రాల తయారీలో సహకారం అందిస్తాం. రష్యాలో భారతీయ భాషల చిత్రాలను ప్రోత్సహిస్తాం. అణువిద్యుత్ సహా పలు రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకున్నాం. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు జరిగాయి.” అని పుతిన్ వివరించారు.

More Stories
భారత్ తటస్థంగా ఉండదు…శాంతికే మద్దతు
2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్- రష్యా వాణిజ్యం
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే