ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) భవనం పేరును కేంద్ర ప్రభుత్వం సేవాతీర్థ్‌గా మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పీఎంవోను ఇక నుంచి సేవాతీర్థ్‌గా పిలవనున్నారు. ప్రధానమంత్రి దశాబ్దాలుగా సౌత్‌బ్లాక్‌లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా, ఆ కార్యాలయం కొత్త భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ప్రకటన వచ్చింది.
సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇంతకుముందు ఈ భవనాలను ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌గా పిలిచేవారు. అయితే పరిపాలనలో సేవా భావం ప్రాముఖ్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సేవా తీర్థ్ అనే పేరు పెట్టాలని నిర్ణయించింది.
కొత్తగా నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లో పీఎంఓతో పాటు కేబినెట్ కార్యదర్శి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ (ఎన్ఎస్ సిఎస్), ఇండియా హౌస్ ముఖ్యంగా ఉండనున్నాయి. ఇందులోని ఇండియా హౌస్ ప్రత్యేకంగా విదేశీ ప్రతినిధులు, ప్రపంచ నాయకులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపే కేంద్రంగా రూపొందుతోంది. దేశ విదేశాంగ వ్యవహారాల్లో ఇది కీలక పాత్ర పోషించనుంది.
పరిపాలన అనేది కేవలం అధికారాన్ని ప్రదర్శించే స్థలం కాదు, ప్రజలకు సేవలందించే కేంద్రం కావాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. “సేవా తీర్థ్ అనేది సేవా భావాన్ని ప్రతిబింబించే పని ప్రదేశం. దేశ ప్రాధాన్యాలు, జాతీయ నీతులు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి” అని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలో ఇప్పుడు ఒక నిశ్శబ్దమైన కానీ లోతైన మార్పు జరుగుతోందని వారు పేర్కొన్నారు. అధికారం నుంచి సేవాభావం వైపు, ఆధిపత్యం నుంచి బాధ్యత వైపు మార్పు జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్ల నివాసాలు అయిన రాజ్ భవన్లు, ఇప్పుడు లోక్ భవన్లుగా మారుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, పేర్లలో పారదర్శకత, కర్తవ్య భావం ప్రతిబింబించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక భాగం. “ప్రతి పేరు, ప్రతి భవనం, ప్రతి చిహ్నం ఒకే సందేశం ఇస్తుంది. ప్రభుత్వం అంటే ప్రజల సేవ కోసం ఉన్న వ్యవస్థ” అని అధికారులు తెలిపారు.

More Stories
బంగ్లాదేశ్‌లో మూకదాడిపై భారత్‌లో ఆగ్రహ జ్వాల
రాహుల్ జరుపుతుంది ‘భారత్ బద్నామ్ యాత్ర’
ఉన్నావ్ అత్యాచార కేసు నిందితుడి జైలు శిక్ష నిలిపివేత