రాజధాని అమరావతిలో 2వ విడత భూసమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల పరిథిలో 16,666.57 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయనున్నారు. వైకుంఠపురంలో 1,965 ఎకరాలు, పెదమద్దూరులో 1,018 ఎకరాల పట్టా భూముల సమీకరణ చేయనున్నారు.
యండ్రాయి గ్రామ పరిధిలో 1,879 ఎకరాలు పట్టా, 46 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, కర్లపూడి లేమల్లే గ్రామంలో 2,603 ఎకరాలు పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించనున్నారు. గుంటూరు జిల్లా తుల్లూరు మండలంలోని 3 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. వడ్డమానులో 1,763.29 ఎకరాల పట్టా భూమి, 4.72 అసైన్డ్ ల్యాండ్ సమీకరించనున్నారు. హరిశ్చంద్రాపురంలో 1,448.09 ఎకరాలు పట్టా, 2.29 అసైన్డ్ ల్యాండ్ సహా పెదపరిమిలో 5,886.18 ఎకరాల పట్టా భూమి సమీకరణ చేయనున్నారు.
7 గ్రామాల్లో కలిపి పట్టాభూమి 16,562.52 ఎకరాలు, 104.01 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరణ చేయనున్నారు. ఈ భూసమీకరణ బాధ్యతను సీఆర్డీఎ కమిషనర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల పరిధిలో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను కలుపుకుంటే మొత్తం 20,494 ఎకరాల భూమి అందుబాటులోకి రానుందని ఆదేశాల్లో ప్రభుత్వం వెల్లడించింది.
రెండో విడతలో సేకరించిన భూములలో ప్రధానమైనవి నిర్మించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్, రైల్వేలైన్ నిర్మాణాలు చేయనున్నారు. వీటన్నింటికి మార్గం సుగమమైంది. దీనితోపాటు రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న ఉత్తర-దక్షిణం, తూర్పు, పడమర రహదారులు ఇన్నర్ రింగ్‌రోడ్డుతో అనుసంధానం కానున్నాయి.

More Stories
వచ్చే 50 ఏళ్లకు ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే
త్వరలో టీటీడీ స్థానిక ఆలయాల్లో దశలవారీ శ్రీవారి సేవ