* వన్డేల్లో అత్యధిక సిక్స్‌ల కొట్టిన వీరుడిగా రికార్డు
ప్రపంచంలోని మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కొత్త అధ్యాయం లిఖించాడు. రాంచీ వన్డేలో సూపర్ శతకంతో రెచ్చిపోయిన విరాట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ‘ఆల్‌టైమ్ రికార్డు’ను బ్రేక్ చేశాడు. ఇదివరకూ వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సెంచరీలను దాటేసిన కింగ్ కోహ్లీ, ఈసారి ఒక ఫార్మాట్లో అత్యధిక శతకాలతో సచిన్ రికార్డును బద్ధలుకొట్టాడు.
కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం రాంచీలో హోరాహోరీగా జరిగిన మొదటి వన్డేలో 17 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది
సుదీర్ఘ ఫార్మాట్లో సచిన్ 51 శతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే కోహ్లీ వన్డేల్లో 52వ సారి మూడంకెల స్కోర్ అందుకొని అంతర్జాతీయ క్రికెట్ ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీతో చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం విరాట్ అన్ని ఫార్మాట్లలో కలిపి 83 సెంచరీలు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 7 వేల శతకం కోహ్లీ సాధించడం విశేషం. జాన్సెన్ ఓవర్లో బౌండరీతో 50 ఓవర్ల ఫార్మాట్లో 52వ సెంచరీ నమోదు చేశాడు కోహ్లీ. తనకెంతో ఇష్టమైన రాంచీలో మూడోసారి వందకు చేరువైన విరాట్ గాల్లోకి ఎగిరి పంచ్ విసిరి సంబురాలు చేసుకున్నాడు. తన మెడలోని తమ పెళ్లి ఉంగురాన్ని ముద్దాడి సెంచరీని తనివితీరా ఆస్వాదించాడు కోహ్లీ.
అయితే, సచిన్ 100 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సార్లు మూడంకెల్ స్కోర్ నమోదు చేశాడు.
వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన కోహ్లీ వన్డేల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. రాంచీలో దక్షిణాఫ్రికా బౌలర్లపై ఊచకోతకు దిగిన అతడు వింటేజ్ కోహ్లీని తలపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు డకౌట్ల తర్వాత ఆఖరి వన్డేలో అజేయ అర్ధ శతకం బాదిన విరాట్ ఇప్పుడు స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలో శతకంతో కదంతొక్కాడు.జాన్సెన్ ఓవర్లో సిక్సర్‌తో వన్డేల్లో 75వ హాఫ్ సెంచరీ సాధించిన విరాట్, 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో10 వేల పరుగుల క్లబ్లో చేరాడు. రాంచీ వన్డేకు ముందు అతడి ఖాతాలో 9,936 రన్స్ ఉన్నాయి. సూపర్ సెంచరీ కొట్టిన కోహ్లీ 135 వద్ద ఔటైయ్యాడు. దాంతో, ద్వైపాక్షిక సిరీస్‌లో 10,071 రన్స్ సాధించాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 7,669 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
మరోవంక, టీమిండియా వెటరన్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌ల కొట్టిన వీరుడిగా నిలిచాడు. రాంచి వన్డేలో సౌతాఫ్రికా బౌలర్ ప్రేనెలన్ సుబ్రాయెన్ బౌలింగ్‌లో (14.1, 14.2 బంతులు) రోహిత్ రెండు వరుస సిక్స్‌లు కొట్టాడు. ఈ మ్యాచ్ ముందు వరకు రోహిత్ శర్మ ఖాతాలో వన్డేల్లో 349 సిక్స్లున్నాయి.
ప్రేనెలన్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లతో రోహిత్ శర్మ పాకిస్థాన్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది() పేరిట ఉన్న అత్యధిక సిక్స్‌ల (351) రికార్డును సమం చేశాడు. అనంతరం మార్కో యాన్సన్ బౌలింగ్‌లో (19.4) బౌలింగ్‌లో అతడు అద్భుతమైన సిక్స్ బాదాడు. దీంతో అఫ్రిది పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బ్రేక్ అయింది. దీంతో వన్డేల్లో అత్యధిక సిక్స్‌ల (352) వీరుడిగా రోహిత్ నిలిచాడు. సౌతాఫ్రికాతో రోహిత్ 57(51 బంతుల్లో) పరుగుల వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుతిరిగాడు.

More Stories
ఇళ్లల్లో మాతృభాష, సంస్కృతం వాడకం తగ్గడం ఆందోళనకరం
నా జీవిత భాగస్వామికి భారతీయ మూలాలు.. కుమారుని పేరు శేఖర్
శ్రీ భూమి కథ- నా అనుభవం